
రీసెంట్ టైంలో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా 'తుడరుమ్'. మోహన్ లాల్, శోభన జంటగా నటించిన ఈ చిత్రం ఊహించని వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.
మోహన్ లాల్ హీరోగా నటించిన 'ఎల్ 2: ఎంపురాన్' సినిమా మార్చి చివరన రిలీజైంది. చాలా హడావుడి చేశారు గానీ జస్ట్ ఓకే అనిపించుకుంది. సరిగ్గా నెల తర్వాత మోహన్ లాల్ నుంచే 'తుడరుమ్' రిలీజైంది. ప్రమోషన్ లాంటివేం లేకుండానే దీన్ని రిలీజ్ చేశారు. బడ్జెట్ కూడా చాలా తక్కువే. అలాంటిది ఇది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)
పెట్టిన బడ్జెట్ వచ్చిన వసూళ్ల బట్టి చూస్తే చాలా లాభాలు అందుకున్నట్లే. ఇప్పుడీ ఈ చిత్రాన్ని హాట్‌స్టార్‌లో మే 30 నుంచి తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదే వీకెండ్ లో రీసెంట్ చిత్రాలు హిట్ 3(మే 29), రెట్రో (మే 30) ఓటీటీల్లో అందుబాటులోకి రానుండటం విశేషం. అంటే ఈ వీకెండ్ మూవీ లవర్స్‌కి పండగే పండగ.
తుడరుమ్ విషయానికొస్తే.. షణ్ముగం అలియాస్ బెంజ్(మోహన్ లాల్) ఓ ట్యాక్సీ డ్రైవర్. భార్య(శోభన), ఇద్దరు పిల్లలతో ఆనందంగా బతికేస్తుంటాడు. ఊహించని విధంగా ఓ పోలీసు కేసులో ఇరుక్కుంటాడు. దీన్నుంచి బయటపడేసరికి కొడుకు కనిపించకుండా పోతాడు. దీంతో వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో బెంజ్‌కి ఊహించని విషయాలు తెలుస్తాయి? ఇంతకీ ఏంటవి? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలో వచ్చేస్తున్న థ్రిల్లర్ సినిమా)
