
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో భైరవం, షష్టిపూర్తి సినిమాలు మాత్రమే రానున్నాయి. వీటిపై పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 14 మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో మూడు మాత్రం కచ్చితంగా చూడాల్సిన జాబితాలో ఉంటాయి.
(ఇదీ చదవండి: బాలకృష్ణతో పవన్ పోరు.. వార్ తప్పదు)
ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాల విషయానికొస్తే.. నాని 'హిట్ 3', సూర్య 'రెట్రో' సినిమాలతో పాటు అజ్ఞాతవాసి అనే కన్నడ డబ్బింగ్ మూవీని మాత్రం అస్సలు మిస్ కావొద్దు. వీటితో పాటు వీకెండ్‌లో మరికొన్ని సడన్ రిలీజ్‌లు ఉండొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (మే 26 నుంచి జూన్ 01 వరకు)
నెట్‌ఫ్లిక్స్
మైక్ బిర్బిగిలియా (ఇంగ్లీష్ సినిమా) - మే 26
కోల్డ్ కేస్: ద టైలీనాల్ మర్డర్స్ (డాక్యుమెంటరీ సిరీస్) - మే 26
హిట్ 3 (తెలుగు సినిమా) - మే 29
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ మూవీ) - మే 30
లాస్ట్ ఇన్ స్టార్ లైట్ (కొరియన్ సినిమా) - మే 30
ద హార్ట్ నోస్ (స్పానిష్ మూవీ) - మే 30
రెట్రో (తెలుగు సినిమా) - మే 31
హాట్‌స్టార్
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 28
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 29
ఏ కంప్లీట్ అన్‌నోన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 31
జీ5
అజ్ఞాతవాసి (కన్నడ సినిమా) - మే 28
సోనీ లివ్
కంఖజురా (హిందీ సిరీస్) - మే 30
ఆపిల్ ప్లస్ టీవీ
బోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 30
లులు ఇన్ రైనోసిరోస్ (ఇంగ్లీష్ సినిమా) - మే 30
(ఇదీ చదవండి: కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష‍్ణు ఆసక్తికర కామెంట్స్)