
ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువ. భాషతో సంబంధం లేకుండా చూస్తుంటారు. అందుకు తగ్గట్లే దర్శకులు కూడా డిఫరెంట్ స్టోరీలతో ఈ తరహా మూవీస్ తీస్తుంటారు. అలా ఇప్పుడు ఓ హిందీ చిత్రం.. గతంలో పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దీన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మీర్జాపుర్, పాతాళ్ లోక్ తదితర వెబ్ సిరీసులతో అభిషేక్ బెనర్జీ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'స్టోలెన్'. దీన్ని జూన్ 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. చూచాయిగా స్టోరీ ఏంటనేది బయటపెట్టారు.
(ఇదీ చదవండి: కొంతమంది చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు: దిల్ రాజు)
స్టోలెన్ విషయానికొస్తే.. ఓ రైల్వే స్టేషన్‌లో ఉన్న తల్లి దగ్గరున్న పాపని దుండగులు ఎత్తుకుపోతారు. దీన్ని చూసిన గౌతమ్, రామన్ అనే అన్నదమ్ములు.. ఆ పాపని వెతికిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.
ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దాదాపు 14 కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హిట్ 3, రెట్రో, అజ్ఞాతవాసి అనే కన్నడ సినిమా చూడదగ్గ వాటిలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సడన్ రిలీజయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి.
(ఇదీ చదవండి: లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష.. ఎన్ని కోట్లో తెలుసా?)