లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ కమెడియన్.. ఎన్ని కోట్లో తెలుసా? | Tollywood Comedian Harsha Chemudu Buys BMW F87 Car, Know Its Price Details And Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Harsha Chemudu: కోట్లు విలువ చేసే కారు కొన్న వైవా హర్ష

May 26 2025 3:14 PM | Updated on May 26 2025 3:25 PM

Harsha Chemudu Buys Bmw F87 Car And Price Details

వైవా అనే షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్న హర్ష.. తర్వాత తర్వాత తెలుగులో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. గతేడాది 'సుందరం మాస్టర్' అనే మూవీలో హీరోగానూ నటించాడు. ప్రస్తుతానికైతే మోగ్లీ, బకాసుర రెస్టారెంట్ అనే చిత్రాలు చేస్తున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే కార్లు, బైక్స్ అంటే ఇతడికి తెగ పిచ్చి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారుని కొనుగోలు చేశాడు.

కమెడియన్‌గా హర్ష అందరికీ తెలుసు. కానీ వీలుచిక్కినప్పుడల్లా స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తుంటాడు. ఆ బైక్స్ అన్నీ కూడా రూ.20 లక్షలు, రూ.30 లక్షలు విలువ చేసేవే. ఇప్పుడు వాటికి తోడు బీఎండబ్ల్యూ ఎఫ్87 ఎమ్2 కాంపిటీషన్ కారు కొనుగోలు చేశాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)

హైదరాబాద్ మార్కెట్ లో ఈ కారు ధర రూ.కోటి 30 లక్షల నుంచి రూ.కోటి 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సినిమాలు చేస్తూ సంపాదిస్తున్న హర్ష.. వాటిని కార్స్, బైక్స్ కొనడానికే ఖర్చు పెడుతున్నాడేమో అనిపిస్తుంది.

హర్ష వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2021లో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఈమెతో దిగిన ఫొటోలని పోస్టూ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతానికైతే కెరీర్ పరంగా హర్ష ఫామ్‌లో ఉన్నాడు.

(ఇదీ చదవండి: బాలకృష్ణతో పవన్‌ పోరు.. వార్‌ తప్పదు)

Advertisement
 
Advertisement
Advertisement