breaking news
Harsha Chemudu
-
వైవా హర్ష ఇంట్లో ఇన్ని కార్లు, బైక్సా? ఇదంతా మీవల్లేనంటూ ఎమోషనల్
దసరా వచ్చిందంటే ఆయుధపూజ చేయాల్సిందే! ఇంట్లో ఉన్న బండిని తళతళా మెరిసేట్టు శుభ్రంగా కడిగి పూజ చేసి దిష్టి తీయాల్సిందే! కమెడియన్ వైవా హర్ష (Harsha Chemudu) కూడా అదే చేశాడు. తన కార్లు, బైకులన్నింటినీ శుభ్రంగా కడిగి దండవేసి ఇంటి ముందు రెడీగా పెట్టాడు. భార్యతో కలిసి వాహనపూజ చేశాడు. ఈ మేరకు పలు ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.ఫ్యామిలీ త్యాగాలుఆయుధపూజ చేయడానికి ఏడాదంతా ఎదురుచూస్తాం. ఇవన్నీ చేయటానికి ఎంతో కష్టపడతాం. ఆటోమొబైల్స్ మీద నాకున్న ఇష్టాన్ని అర్థం చేసుకుని, నేను ఎన్ని వాహనాలు కొంటున్నా అడ్డు చెప్పని ఫ్యామిలీకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ల త్యాగాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడూ వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే నేను బాధపడకూడదన్నదే వాళ్ల కోరిక. అలాగే ఇది నా చిన్ననాటి కల.నా ఇంటినిండా అవే..చిన్నప్పుడు కార్లు, బైకులంటూ వాటి ఫోటోలతో నా గదినంతా నింపేసేవాడిని. ఎక్కడ చూసినా వాటి స్టిక్కర్లే ఉండేవి. నా పాకెట్‌మనీలో కొంత డబ్బు దాచుకుని దానితో ఆటోమొబైల్స్ మ్యాగజైన్లు కొనుక్కునేవాడిని. కొద్దిరోజుల్లోనే అది పూర్తిగా చదివేసి.. మళ్లీ తర్వాతి నెల మ్యాగజైన్ కోసం ఎదురుచూసేవాడిని. అలా నా చిన్నప్పుడు నేను ఇష్టపడ్డ వాహనాలను సేకరిస్తున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ కొనుక్కుంటూ పోతున్నాను. అందుకే నా దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయి.మీ వల్లే ఇదంతా..మీ సపోర్ట్ లేకుంటే ఇవన్నీ కొనగలిగేవాడినే కాదు. నన్ను మీలో ఒకడిగా చూసుకుంటున్నందుకు చాలా చాలా థాంక్స్. నా ప్రతి విజయంలో మీ భాగస్వామ్యం ఉంది. మీవల్లే నేనిక్కడ ఉన్నాను. మీవల్లే నా కలల్ని సాకారం చేసుకోగలుగుతున్నాను అని రాసుకొచ్చాడు. వైవా హర్ష.. ఈ ఏడాది వచ్చిన గేమ్ ఛేంజర్, తండేల్, సారంగపాణి జాతకం, జూనియర్, బకాసుర రెస్టారెంట్ చిత్రాల్లో మెరిశాడు. View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) చదవండి: రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్ నటి -
‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
లగ్జరీ కారు కొన్న టాలీవుడ్ కమెడియన్.. ఎన్ని కోట్లో తెలుసా?
వైవా అనే షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్న హర్ష.. తర్వాత తర్వాత తెలుగులో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. గతేడాది 'సుందరం మాస్టర్' అనే మూవీలో హీరోగానూ నటించాడు. ప్రస్తుతానికైతే మోగ్లీ, బకాసుర రెస్టారెంట్ అనే చిత్రాలు చేస్తున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే కార్లు, బైక్స్ అంటే ఇతడికి తెగ పిచ్చి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారుని కొనుగోలు చేశాడు.కమెడియన్‌గా హర్ష అందరికీ తెలుసు. కానీ వీలుచిక్కినప్పుడల్లా స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తుంటాడు. ఆ బైక్స్ అన్నీ కూడా రూ.20 లక్షలు, రూ.30 లక్షలు విలువ చేసేవే. ఇప్పుడు వాటికి తోడు బీఎండబ్ల్యూ ఎఫ్87 ఎమ్2 కాంపిటీషన్ కారు కొనుగోలు చేశాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)హైదరాబాద్ మార్కెట్ లో ఈ కారు ధర రూ.కోటి 30 లక్షల నుంచి రూ.కోటి 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సినిమాలు చేస్తూ సంపాదిస్తున్న హర్ష.. వాటిని కార్స్, బైక్స్ కొనడానికే ఖర్చు పెడుతున్నాడేమో అనిపిస్తుంది.హర్ష వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2021లో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు ఈమెతో దిగిన ఫొటోలని పోస్టూ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతానికైతే కెరీర్ పరంగా హర్ష ఫామ్‌లో ఉన్నాడు.(ఇదీ చదవండి: బాలకృష్ణతో పవన్ పోరు.. వార్ తప్పదు) View this post on Instagram A post shared by TURBO BUOY !! (@turbochemudu) -
'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
దెయ్యం కోరికను తీర్చే 'బకాసుర రెస్టారెంట్'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ కమెడియన్స్ వైవా హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఈ మూవీకి ఎస్జే శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్జే మూవీస్ బ్యానర్లో లక్ష్మయ్య ఆచారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైవా హర్ష, ప్రవీణ్ కామెడీ అభిమానులను ఓ రేంజ్లో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో సీన్స్ హారర్ సినిమాను తలపించేలా ఉన్నాయి. ప్రేమకథా చిత్రమ్ పార్వతి కదూ? పదేళ్లయినా అదే దెబ్బ.. నువ్వు ఇంకా పోలేదా? అని ప్రవీణ్ చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ సినిమాకు వికాస్ బడిస సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. -
ఖరీదైన బైక్ కొనుగోలు చేసిన ప్రమఖ హాస్య నటుడు వైవా హర్ష (ఫోటోలు)