దెయ్యం కోరికను తీర్చే 'బకాసుర రెస్టారెంట్'.. ఆసక్తిగా ట్రైలర్ | Praveen and Harsha Chemudu latest Movie Bakasura Restaurant Official Trailer | Sakshi
Sakshi News home page

Bakasura Restaurant Official Trailer: 'ప్రేమకథా చిత్రమ్‌ పార్వతి కదూ? నువ్వు ఇంకా పోలేదా?'.. ఆసక్తిగా ట్రైలర్

May 16 2025 9:32 PM | Updated on May 16 2025 9:32 PM

Praveen and Harsha Chemudu latest Movie Bakasura Restaurant Official Trailer

టాలీవుడ్ కమెడియన్స్ వైవా హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఈ మూవీకి ఎస్‌జే శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్‌జే మూవీస్ బ్యానర్‌లో లక్ష్మయ్య ఆచారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తే హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైవా హర్ష, ప్రవీణ్ కామెడీ అభిమానులను ఓ రేంజ్‌లో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్‌లో సీన్స్‌ హారర్ సినిమాను తలపించేలా ఉన్నాయి.  ప్రేమకథా చిత్రమ్‌ పార్వతి కదూ? పదేళ్లయినా అదే దెబ్బ.. నువ్వు ఇంకా పోలేదా? అని ప్రవీణ్ చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ సినిమాకు వికాస్ బడిస సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ అనౌన్స్‌ చేయనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement