అనారోగ్యంతో కమెడియన్‌.. టాలీవుడ్ నటుడి సాయం | tollywood actor Bathina Dasharatha Helps To Comedian Ramachandra | Sakshi
Sakshi News home page

Ramachandra: కమెడియన్ రామచంద్రకు టాలీవుడ్ నటుడి సాయం

Oct 26 2026 8:07 PM | Updated on Oct 26 2026 8:12 PM

tollywood actor Bathina Dasharatha Helps To Comedian Ramachandra

టాలీవుడ్ నటుడు బత్తిన దశరధ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ‘వెంకీ’ సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ రామచంద్రకు అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. తన వంతు సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామచంద్రకు  ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రామచంద్ర త్వరగా కోలుకునేందుకు తెలుగు సినీనటులు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.

సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర కళాకారులంతా ఒక కుటుంబంలా ముందుకొచ్చి రామచంద్రకు అండగా నిలవాలని  దశరధ విజ్ఞప్తి చేశారు. ఆయన చికిత్సకు మరింత సహాయం అందించే దిశగా ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. దశరధ చేసిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలియజేశారు. దశరధ వెండితెర ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 30న విడుదల కానున్న ‘కిల్లర్’ సినిమా ఘనవిజయం సాధించాలని రామచంద్ర శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement