యశ్ హీరోగా వచ్చిన ఫుల్ యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ మూవీ కేజీఎఫ్. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో యశ్ ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్-2 సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ రెండు చిత్రాలతో కన్నడ స్టార్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అంతలా యశ్ కెరీర్‌లో గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.
అయితే ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కించిన హనుమాన్ అంశ్ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పలు పెద్ద సినిమాల రికార్డులను అధిగమించింది. తాజాగా మరో చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్..
కన్నడలో తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం ప్రేమద ఊరాలి. ఈ మూవీని కేవలం రూ.2 నుంచి 3 కోట్ల బడ్జెట్‌లోనే తెరకెక్కించారు. ఈ శాండల్‌వుడ్ మూవీ గతనెలలో థియేటర్లలో రిలీజైంది. కేవలం నెల రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కన్నడలోనే విడుదలైన ఈ సినిమా కేజీఎఫ్ ఆల్‌టైమ్ వసూళ్లను అధగమించింది. నెల రోజుల్లోనే రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసింది. కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానానికి చేరింది. కాగా.. 2018లో రిలీజైన కేజీఎఫ్ చాప్టర్-1 కన్నడ బాక్సాఫీస్ వద్ద రూ.135 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ రికార్డ్‌ను చిన్న సినిమా ప్రేమద ఊరాలి దాటేసి చరిత్ర సృష్టించింది. దీంతో కంటెంట్ ఉంటే చాలు.. భారీ బడ్జెట్‌తో అవసరం లేదని సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


