జైలర్-2 జోరు.. 11 రోజుల్లోనే అరుదైన రికార్డ్..! | Rajinikanth's Jailer 2 Breaks Robo 2 Movie Record in just 11 days | Sakshi
Sakshi News home page

Jailer 2 Movie: జైలర్-2 జోరు.. 11 రోజుల్లోనే అరుదైన రికార్డ్..!

Oct 26 2026 5:24 PM | Updated on Oct 26 2026 6:11 PM

Rajinikanth's Jailer 2 Breaks Robo 2 Movie Record in just 11 days

తలైవా రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ జైలర్-2. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకొచ్చారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి రోజే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది.

ఈ మూవీ రిలీజైన 11 రోజుల్లోనే  తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. రజినీకాంత్‌ గతంలో నటించిన రోబో-2 మూవీ రికార్డును ఈ సినిమా బద్దలుకొట్టింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల మార్కు దాటేసింది. దీంతో ఈ క్రేజీ మార్క్ అందుకున్న తొలి కోలీవుడ్ మూవీగా ఘనత సాధించింది.

ఈ ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.44 కోట్ల గ్రాస్ వసూలు చేసంది. ఇదో జోరు కొనసాగితే త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కు అందుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.398 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగా..రూ.466.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement