ప్రస్తుతం టాలీవుడ్‌లో విరోష్ జంట పేరు మార్మోగిపోతోంది. వీరిద్దరిపై సోషల్ మీడియాలో విడాకుల రూమర్స్ రావడంతో ఈ జంట స్పందించారు. ఇప్పటికే రష్మిక తమ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని సుదీర్ఘ పోస్ట్ చేసింది. తమ ప్రేమను ఎవరు కూడా ప్రపోజల్స్‌తో కొలవలేరని స్పష్టం చేసింది.
విజయ్ సైతం తన భార్యపై ప్రేమను చాటుకున్నారు. తను నా భార్య మాత్రమే కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ మహిళ అంటూ పోస్ట్ చేశారు. ఆమె నా జీవితంలో అత్యంత అందమైన అధ్యామని.. తన విషయంలో నేను సరైన నిర్ణయం తీసుకున్నానని రాసుకొచ్చారు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ప్రపంచమంతా మాకు వ్యతిరేకమైనా.. నేను, ఆమె ఎప్పటికీ కలిసే ఉంటామన్నారు. మా ప్రేమను గౌరవించేవారికి ప్రేమతో ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరిపై వస్తున్న ట్రోల్స్‌కు విరోష్ జంట తమదైన స్టైల్లో గట్టిగానే కౌంటరిచ్చారు.


