నన్ను క్షమించండి.. మళ్లీ కలుద్దాం: విశ్వక్ సేన్ | Tollywod Hero Vishwak Sen apology Letter To Fans | Sakshi
Sakshi News home page

Vishwak Sen: 'మనస్ఫూర్తిగా చెబుతున్నా.. నన్ను క్షమించండి'

Oct 25 2026 6:50 PM | Updated on Oct 25 2026 6:58 PM

Tollywod Hero Vishwak Sen apology Letter To Fans

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కల్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ‍అక్టోబర్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు విశ్వక్ సేన్. ఇందులో భాగంగానే ఫ్యాన్స్‌తో మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ అభిమానులతో ఫోటో సెషన్ నిర్వహించారు. అయితే అందరితో ఫోటోలు దిగేందుకు సమయం సరిపోకపోవడంతో ఫోటోలు దిగలేకపోయారు. దీంతో హీరో తన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో నోట్ రిలీజ్ చేశారు.

విశ్వక్ సేన్ తన నోట్‌లో ప్రస్తావిస్తూ..'నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా. ఊహించని దానికంటే మీ నుంచి ఎక్కువ రెస్పాన్స్ రావడంతో అందరినీ కలవలేకపోయా. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అందరితో ఫోటోలు దిగలేకపోయా. నా ఫోటో దిగాలని వచ్చి నిరాశ చెందిన ప్రతి అభిమానికి నేను క్షమాపణలు చెబుతున్నా. మరో ఫోటో సెషన్ ఏర్పాటు చేసి మీ అందరితో ఫోటోలు దిగుతా. ఈ సారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తాం. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి నా ధన్యవాదాలు. మీ ప్రేమ నాకెప్పుడు ప్రత్యేకమే. ప్రేమతో మీ విశ్వక్ సేన్' అంటూ పోస్ట్ చేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement