బాలనటిగా అరంగ్రేటం చేసిన ప్రముఖ నిర్మాత కూతురు | Bunny Vas Daughter Acting Debut Idupu Kayitham Movie | Sakshi
Sakshi News home page

Bunny Vas Daughter: ‘ఇడుపు కాయితం’లో బాలనటిగా ప్రముఖ నిర్మాత కూతురు

Oct 25 2026 5:00 PM | Updated on Oct 25 2026 5:11 PM

Bunny Vas Daughter Acting Debut Idupu Kayitham Movie

 వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. నిర్మాత బన్నీ వాసు, డైరెక్టర్ సుకుమార్ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నాగదుర్గ హీరోయిన్‌. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల గడప సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

ఈ సినిమా ద్వారా తన కుమార్తె బాల నటిగా అరంగ్రేటం చేసిందని ఆయన  వెల్లడించారు. చిత్రంలోని శ్రీలత పాటలో వచ్చే పిల్లల సన్నివేశంలో తన కూతురు ఒక చిన్న డాక్టర్ పాత్రలో నటించిందని తెలిపారు.

సాంగ్‌ విషయానికి వస్తే..
ఆ సాంగ్ లో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. సురేశ్‌ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన శ్రీలత పాటకు అలరాజు సాహిత్యం అందించారు. శంకర్‌ బాబు కందుకూరి, మోహన్‌ భోగరాజు ఆలపించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్‌ 11న  ఈ చిత్రం విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌..? ఓ సూపర్‌స్టార్‌ కొడుకుతో స్టార్‌ హీరోయిన్‌!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement