బాలీవుడ్ నటి అనన్య పాండే మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన విదేశీ ప్రియుడు వాకర్‌తో బ్రేకప్ అయినట్లు ప్రచారం జరగ్గా.. తాజాగా ఓ సూపర్‌స్టార్ కుమారుడుతో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. లండన్‌లో వీరిద్దరూ ఓ రెస్టారెంట్‌లో కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అనన్య ప్రేమలో ఉన్నారంటూ
చుంకీ పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనన్య.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి గతంలోనూ పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అమెరికన్ మోడల్ వాకర్‌తో అనన్య ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపించాయి. అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో వాకర్‌ను పరిచయం చేయడం, అతడి పేరుతో ఉన్న లాకెట్ ధరించడం వంటి అంశాలు అప్పట్లో చర్చకు దారితీశాయి. అయితే, తమ బంధం గురించి వారిద్దరూ అధికారికంగా వెల్లడించలేదు.
మరోసారి చర్చ
ఇప్పుడు అనన్య వ్యక్తిగత జీవితం మరోసారి చర్చల్లోకి వచ్చింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాల కుమారుడైన ఆరవ్‌తో అనన్య సన్నిహితంగా ఉన్నట్లు ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రెస్టారెంట్‌లో ఆరవ్.. అనన్యకు ఫుడ్ పెడుతున్నట్లు కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదైనా ప్రత్యేక బంధం ఉందా? అంటూ తెగ చర్చ జరుగుతోంది. అయితే, కలిసి కనిపించినంత మాత్రాన వారిద్దరూ ప్రేమలో ఉన్నారని నిర్ధారించలేమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఊహాగానాలుగానే చూడాలి మరి.
(ఇదీ చదవండి: నడవలేని స్థితిలో ఉన్నా.. తెలుగు నటి సుభాషిణి భావోద్వేగం)


