breaking news
Idupu Kayitham Movie
-
అందుకే ‘శ్రీలత’ పాటని తెలంగాణ స్టైల్ లో కంపోజ్ చేయలేదు
‘శ్రీలత..’ పాట కోసం డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే సినిమాలోని కథలో భాగమవుతూ, ప్రమోషన్ కు కూడా ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాం. పాటలో క్యాచీ లిరిక్స్ కూడా కుదిరాయి. ప్రజలు ఈ పాటను ఓన్ చేసుకునేలా ఉండాలని డిజైన్ చేసి ముందే రిలీజ్ చేశాం.ఈ పాటకు ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయి. పాట అందరికీ రీచ్ అవ్వాలనే కంప్లీట్ గా తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు. చరణం మెలొడియస్ గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశాను’ అని అన్నారు సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి. ప్రియదర్శి, ఫోక్ డాన్సర్ నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. బన్నీవాస్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘శ్రీలత..’పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. .సురేశ్ బొబ్బిలి మాట్లాడుతూ.. 'శ్రీలత..' పాట మా ఫ్యామిలీ మెంబర్స్ కు బాగా నచ్చింది. వాళ్లు ఫోన్స్ చేసి పాట బాగుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మా సాంగ్ కు రెస్పాన్స్ బాగుంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ పాటలో నేను నటించాను. ఈ ఆలోచన బన్నీ వాస్ గారిది. మీరు ఇన్ని సాంగ్స్ కు మ్యూజిక్ చేశారు. మీరు ఎవరో ప్రేక్షకులకు తెలియాలి కదా అని ఈ సాంగ్ లో నేను కూడా నటించేలా చేశారు. నేను ప్రజలకు తెలియాలి అనే ఆలోచన నాలో కూడా ఉండేది. అందుకే ఒక ప్రైవేట్ సాంగ్ నేనే పర్ ఫార్మ్ చేస్తూ చేయాలని కూడా అనుకున్నాను. పాటలో నటించడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ పాటలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. లిరిక్ రైటర్ అలరాజు అన్న డైరెక్టర్ వంశీరెడ్డి అన్నకు ఫ్రెండ్. నాకు కూడా అలరాజు అన్న తెలుసు. ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో ఐడియా ఉంది. ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరిచితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటకు కనెక్ట్ అయ్యారు. పాట బాగుందని కాల్ చేసిన చెబుతున్నారు.లిరిక్ రైటర్ అలరాజు మాట్లాడుతూ.. ‘ఈ పాట రాసేప్పుడు డైరెక్టర్ వంశీ రెడ్డి ..‘కథతో సంబంధం లేకుండా ఈ పాట అందరికీ నచ్చేలా ఉండాలి. సినిమా చూశాక ఇంకా శ్రోతలకు కనెక్ట్ కావాలి’అని చెప్పారు. మీరు ఇప్పుడు ఆడియో వింటుంటే నచ్చుతుంది. కానీ సినిమాలో చూసినప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా ఈ పాటను ఇష్టపడతారు. హీరో హీరోయిన్స్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది. శ్రీలత అలకకు కారణం ఏంటి, శ్రీనివాస్ ఏం చెప్పి ఆమెను బుజ్జగించాడు అనే నేపథ్యంతో ఈ సాంగ్ రూపకల్పన చేశారు. రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్స్ కాకుండా ఈ పాట సాహిత్యం కొత్తగా రాసేందుకు ప్రయత్నించాను. టైటిల్ రివీల్ చేసేందుకు ముందగానే ఈ పాట ఫైనల్ అయ్యింది. ఈ పాటలోని పదాలను పూర్తిగా ఫోక్ స్టైల్ లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశాను. ఒక పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నానే ప్రెషర్ నాపై ఉండేది కానీ వాళ్లు ఇచ్చిన ఇన్ పుట్స్ వల్ల కంఫర్ట్ గా లిరిక్స్ రాశాను. శ్రీలత పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇడుపుకాయితం గీత రచయితగా నా బతుకు మార్చిన కాగితం అనుకుంటాను’ అన్నారు. -
శ్రీలత.. ‘ఇడుపు కాయితం’ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ సుకుమార్ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నాగదుర్గ హీరోయిన్. ఈ సినిమా నుంచి ‘శ్రీలత’ సాంగ్‌ను రిలీజ్ చేశారు.'శ్రీలత..' సాంగ్ లో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. సురేశ్ బొబ్బిలి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు అలరాజు సాహిత్యం అందించారు. శంకర్ బాబు కందుకూరి, మోహన్ భోగరాజు ఆలపించారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
‘ఇడుపు కాయితం’.. ఆకట్టుకుంటున్న ‘శ్రీలత సాంగ్’ ప్రోమో
ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహించగా, బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ "ఇడుపు కాయితం" సినిమా నుంచి 'శ్రీలత సాంగ్..' ప్రోమో రిలీజ్ చేశారు. కొత్తగా పెళ్లయిన జంట శ్రీలత, శ్రీనివాస్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. ‘ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత, ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత, శ్రీలత శ్రీలత శ్రీలత ఈ శ్రీనివాసుడే నీ జత' అంటూ సాగే ఈ పాట ఫుల్ వెర్షన్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మంచి మెలొడీ ట్యూన్ తో ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. -
డిసెంబర్లో ‘ఇడుపు కాయితం’!
తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ, ప్రియదర్శి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీవాసు, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.‘ఇడుపు కాయితం’సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో మరే చిత్రానికీ లేనంతగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దీంతో ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా బాగా ఆకర్షిస్తోంది. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. "ఇడుపు కాయితం" త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో దర్శక నిర్మాతలు షేర్ చేసుకోనున్నారు. -
ఇది అంతా కావాలనే చేస్తున్నారు అంటే అర్థం ఇదే.. వైరల్ కామెంట్స్!
-
కరుప్పు, కాంతార ఓకే... 'ఇడుపు కాయితం’ నాట్ ఓకే
-
'ఇడుపు కాయితం.. జాతీయ సమస్యగా మార్చారు'': వీకే నరేశ్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అదే చర్చ. ఏ సోషల్ మీడియాలో చూసినా ఆ సినిమా టైటిల్‌పైనే చర్చ నడుస్తోంది. ఒక్కసారిగా ఇప్పుడు అందరి చూపులన్నీ ఆ మూవీపైనే ఉన్నాయి. అదే ఇటీవల ప్రియదర్శి, నాగదుర్గ జంటగా ప్రకటించిన ఇడుపు కాయితం. ఈ టైటిల్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్, స్థానిక మాండలీకంలో పెట్టిన ఈ టైటిల్‌పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా ఈ వివాదంపై నటుడు వీకే నరేశ్ స్పందించారు.నరేశ్ మాట్లాడుతూ..'నేను రెండు రోజులుగా గమనిస్తున్నా. ఇడుపు కాయితం అనే మూవీ టైటిల్‌ను నేషనల్ సమస్యగా మార్చారు. ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేశారని.. ఒక గొప్ప మాండలీకాన్ని అవమానపరుస్తున్నారు. ఇది ఒక తెలుగువాడిగా మనం సిగ్గుతో తల దించుకోవాలి. తెలంగాణ, కోనసీమ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏ మాండలీకమైన ఎన్నో పోరాటాలు జరిగాయి. మనం తెలుగువాళ్లుగా గర్వపడాలి. కేవలం ఒక సినిమాను తీసుకుని మాట్లాడడం చాలా బ్యాడ్. కరుప్పు టైటిల్ చూశాం. కాంతారను హిట్ చేశాం. సినిమాను సినిమాగే చూడండి. దయచేసి సినిమాను, భాషను కలపకండి. దీనిపై తెలుగు భాష సంఘం బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి వాటినిపై చర్చించి వెంటనే వివాదానికి ముగింపు పలకాలి. మన సొంత భాషను మనం నరుక్కుంటే ఎంత సిగ్గుచేటు. ప్రభుత్వం, మీడియా, తెలుగు భాష సంఘం, నెటిజన్స్ అందరూ కలిసి దయచేసి ఈ వివాదాన్ని ముగిద్దాం' అంటూ వీడియో రిలీజ్ చేశారు. My take on IDUPULA KAGITHAM . Please stop defaming/ insulting our Telugu language dialects. 🙏🏼 pic.twitter.com/kEA0sIEruk— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) June 28, 2026 -
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్‌లో తెలంగాణ పిల్ల
‘ఇడుపు కాయితం’.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా టైటిల్ గురించే చర్చ. ఈ సినిమాని ఏపీలో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారా అని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. మా యాసని అవమానిస్తారా అంటూ తెలంగాణ నెటిజన్స్, మెధావులు ఫైర్ అవుతున్నారు. టైటిల్‌ని అవమానిస్తూ వెతకారంగా పెట్టిన పోస్టులకు కౌంటర్‌గా తెలంగాణ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇలా ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల నెటిజన్స్ మధ్య పెద్ద చర్చకు తెరలేపింది. అయితే ఈ క్రమంలో ‘ఇడుపు కాయితం’ హీరోయిన్ నాగదుర్గ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఆమె చేసిన ఫోక్ సాంగ్స్ వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగదుర్గ నేపథ్యం గురించి, ఆమె కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు..→ తెలంగాణ జానపద పాటలకు ఈ మధ్య ఆదరణ పెరిగింది. సినిమాల్లోనూ తెలంగాణ ఫోక్ సాంగ్స్‌ని వాడుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని పల్లె మట్టివాసనలు గల ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. వారిలో డిజిటల్ స్క్రీన్‌పై, యూట్యూబ్ జానపద గీతాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ 'ఫోక్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నృత్యకారిణి నాగదుర్గ (గుత్తా నాగదుర్గ) ఒకరు.→ నాగదుర్గ స్వస్థలం నల్గొండ జిల్లా అడ్డగూడూరు. ఆమె తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరిత్యా నల్గొండ పట్టణంలో స్థిరపడ్డారు. పదో తరగతి వరకు నల్గొండలోనే చదివిన నాగదుర్గ.. ఇంటర్, డిగ్రీ, పీజీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ (పీజీ) పూర్తి చేశారు.→ నాగదుర్గకు చిన్నతనం నుంచే నృత్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. స్థానిక రామాలయంలో జరిగే భజనలు, నృత్యాలను చూసి ఇంటికొచ్చాక చున్నీ కట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసేదట. కూతురిలోని ఈ తపనను గమనించిన తల్లి వాసవి.. ఆమెను నాట్యం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగదుర్గనే చెప్పారు.జానపదంతో జాతకం మారింది→ కూచిపూడి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నాగదుర్గ కోవిడ్ సమయంలో జానపద గీతాల వైపు అడుగులు వేసింది. కోవిడ్ టైమ్‌లో అప్పటికే యూట్యూబ్‌లో రిలీజ్ అయిన 'ధన్ ధన ధన్' అనే ఫోక్ సాంగ్‌కి స్టెప్పులేసి ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిందట. అది చూసే తొలి పాట ‘తిన్నా తీరం పడతలే’ చాన్స్ వచ్చింది. ఫోక్ డ్యాన్సర్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి పాటనే సూపర్ హిట్ అయింది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నాగదుర్గు జాతకమే మారిపోయింది.→ కూచిపూడి నేర్చుకోవడం వల్ల నాగదుర్గకు ముఖ కవళికలు (ఎక్స్ప్రెషన్స్) పలకడం చాలా సులువైంది. జానపద పాటల్లోని ఎనర్జిటిక్ స్టెప్స్‌కు తన క్లాసికల్ హావభావాలను జోడించి ఆమె చేసిన డ్యాన్స్ వీక్షకులను కట్టిపడేసింది. అందుకే ఆమె చేసిన తొలి సాంగ్ ‘తిన్నా తీరం పడతలే’ నుంచి ఇటీవల వచ్చిన ‘లగారే సౌండ్ సాలా’ వరకు ప్రతి పాట మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఆమె కట్టు బొట్టు, పల్లెటూరి పడచులా అమాయకత్వంతో కూడిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో ఆమెను స్టార్‌ను చేశాయి.→ నాగదుర్గకు గ్లామర్ దుస్తుకంటే సాంప్రదాయ చీరకట్టు, హాఫ్ శారీస్ అంటేనే ఇష్టం. స్క్రీన్‌పై కూడా మితిమీరిన గ్లామర్‌కు ఆమె ఒప్పుకోరు. అందుకే చాలా సినిమా అవకాశాలను వదులుకుంది.→ సినిమా ఇండస్ట్రీలో తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎనలేని అభిమానమని, ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికినా చాలని ఓ ఇంటర్వ్యూల్లో నాగదుర్గ చెప్పింది.→ తెలుగులోలో కలివి వనం అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘లవ్ ఓ లవ్’ అనే సినిమా చేసింది. ఇప్పుడు ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని సుకుమార్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో ‘శ్రీలత’ అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిలే ఇప్పుడు నెట్టింట నాగదుర్గను ట్రెండింగ్‌గా మార్చింది. -
‘ఇడుపు కాయితం’పై ట్రోలింగ్.. స్పందించిన బన్నీవాసు
‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్‌పై వస్తున్న ట్రోలింగ్‌పై నిర్మాత బన్నీ వాసు స్పందించాడు. కథను నమ్మి ఆ టైటిల్ పెట్టామని.. అదే టైటిల్‌తో సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేశాడు. ప్రియదర్శి, నాగదుర్గ(తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఫేమ్) జంటగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇడుపు కాయితం.వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో బన్నీ వాసు వర్క్స్, సుకుమార్ రైటింగ్స్‌పై బన్నీ వాసు, సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చిత్రం టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు నెటిజన్లు, ట్రోలర్లు తీవ్రంగా ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ‘ఈ సినిమాను ఆంధ్రా తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా?’, ‘మాకు సబ్ టైటిల్స్ వేయండి’ అంటూ తెలంగాణ యాసను కించపరిచేలా కామెంట్స్ చేస్తున్నారు. వీరికి కౌంటర్‌గా తెలంగాణ నెటిజన్స్ కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల నెటిజన్ల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా బన్నీ వాసు స్పందించాడు. ఆయన ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘మా సినిమా టైటిల్‌పై ఇలా చర్చ జరగడం టెన్షన్‌గా ఉంది. కథను బట్టి మేము ఈ టైటిల్‌ని పెట్టుకున్నాం. దానిపై ఇంత కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదు. కొంతమంది పాజిటివ్‌గా పోస్టులు పెడితే.. మరికొంతమంది నెగెటివ్‌గా పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ జమ్మికుంట(తెలంగాణ) నుంచి వచ్చాడు. ఆయన ప్రాంతం నేపథ్యంలోనే కథను రాసుకున్నాడు. కథకు న్యాయం చేసేందుకునే ‘ఇపుడు కాయితం’అని టైటిల్ పెట్టాం. ఈ సినిమా విడుదలయ్యాక ఆంధ్రావాళ్లకి, తెలంగాణ వాళ్లకే కాదు అందరికి నచ్చుతుంది. ప్రాంతం బట్టి సినిమా ఉండదు. అలా అనుకుంటే ఎక్కడో తీసిన హాలీవుడ్ సినిమాలు ఇక్కడ ఎందుకు ఆడుతాయి? నేను కథను మాత్రమే నమ్ముతాను. అందరికి నచ్చుతుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఇలాంటి వాటిపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకువచ్చేలా పోస్టులు పెట్టొద్దు’ అని ఆయన నెటిజన్స్‌కి విజ్ఞప్తి చేశాడు. ఇక ఇదే టైటిల్‌తో రిలీజ్ చేస్తారా లేదా మారుస్తారా అని రిపోర్టర్ అడగగా.. ‘అదే కథ, అదే టైటిల్.. అదే సినిమా, అందులో నో డౌట్’ అని బన్నీవాసు స్పష్టం చేశాడు. -
'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా
యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ.. హీరోయిన్గా చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా 'ఇడుపు కాయితం'. ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా వంశీరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాయి. బన్నీవాసు, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై కలిసి నిర్మిస్తున్నారు. అయితే అసలు 'ఇడుపు కాయితం' అంటే ఏంటి అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య వార్ నడుస్తోంది.(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. కారు యాక్సిడెంట్ వివాదంలో కొడుకు)'ఇడుపు కాయితం' అనేది పక్కా తెలంగాణ గ్రామీణ పదం కావడంతో ఆంధ్రాతో పాటు హైదరాబాద్‌లో నివసిస్తున్న చాలామందికి దీని అర్థమేంటి అనేది తెలియడం లేదు. ఇడుపు కాయితం అంటే విడాకుల పత్రం. భార్యభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాన్ని ఇలా పిలుస్తారు. ఇప్పుడంటే విడాకుల కోసం కోర్టులకు వెళ్తున్నారు. డివోర్స్ అని ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు.కానీ కొన్నాళ్ల క్రితం కలిసి బతకలేం అని నిర్ణయించుకున్న దంపతులు.. పెద్ద మనుషుల సమక్షంలో విడిపోవడానికి ఒప్పందం చేసుకునేవాళ్లు. దీన్ని ఇడుపు కాయితం అని పిలిచేవాళ్లు. హైదరాబాద్ లాంటి నగరాల్లో దీన్ని పెద్దగా ఉపయోగించట్లేదు గానీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇడుపు కాయితం రాసుకుని విడిపోతున్న జంటలు ఉన్నాయి. ఇడుపు, ఇడుసు అంటే వదిలిపెట్టడం. ఇడుపు కాయితం అంటే విడిపోయేటప్పుడు రాసుకునే అగ్రిమెంట్.అయితే ఈ పదం అంటే ఏంటో తెలియని కొందరు ఆంధ్రా నెటిజన్లు.. ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ చేస్తారా అని ఫన్నీ పోస్టులు పెట్టడంతో తెలంగాణకు చెందిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ చిన్న సినిమా టైటిల్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే మూవీ టీమ్‌కి ఇది ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షూటింగ్ మొదలవకముందే మూవీ గురించి నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారుగా మరి!(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ)


