‘చంద్రబాబు పబ్లిసిటీకి అడ్డూ అదుపు లేదు’ | Chandrababu's publicity is out of control: YSRCP | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు పబ్లిసిటీకి అడ్డూ అదుపు లేదు’

Sep 26 2026 12:31 PM | Updated on Sep 26 2026 12:41 PM

Chandrababu's publicity is out of control: YSRCP

తాడేపల్లి : చంద్రబాబు పబ్లిసిటీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయలు ప్రచారానికే ఖర్చు చేస్తున్నారని, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌లతో కూడా పబ్లిసిటీ చేసుకుంటారట అని శివశంకర్ పేర్కొన్నారు. వారితో అబద్దాలు ప్రచారం చేయిస్తారా? ప్రజలకు సమాచారాన్ని అందించడానికి ఐ ఆండ్‌ పిఆర్ వ్యవస్థ ఉంది. ఇప్పటికే రూ.330 కోట్లు ఆ వ్యవస్థ ద్వారా ఖర్చు చేశారు. ఇంకా కాంక్లైవ్ పేరుతో వందల కోట్లు నేషనల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకున్నారు. ఆ డబ్బులు ప్రజల అవసరాలకు ఖర్చు చేయొచ్చుకదా? అని శివశంకర్ ‍ప్రశ్నించారు.

రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు కనపడటం లేదా? అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ సీఎం చంద్రబాబును నిలదీశారు. వరదల వల్ల  మునిగిపోయిన అమరావతిపై వారితో చెప్పించగలరా?, రాయలసీమ కరువు గురించి చెప్పించగలరా?, ఆ సమస్యలపై ఇన్‌ఫ్లుయన్సర్‌లతో మాట్లాడించండి. ఫాలోవర్స్‌ని బట్టి డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో డబ్బులు ఇస్తే ఫేక్ ఫాలోవర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటి ఫేక్ ఫాలోవర్స్‌కు డబ్బులు ఖర్చు చేస్తారా? అసలు చంద్రబాబు ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోంది? ఉత్తరాంధ్ర వరదల్లో మునిగిపోతే చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోతారా? రాష్ట్ర ప్రజల సమస్యలు చంద్రబాబుకు పట్టవా? అంత రహస్యంగా చంద్రబాబు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అని నిలదీశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement