సాక్షి, హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గణనాథుల శోభాయాత్రలతో ప్రధాన రహదారులు సందడిగా మారడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు పెద్ద సంఖ్యలో విగ్రహాలు తరలివస్తున్నాయి. దీంతో ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని సీపీ సజ్జనార్ తెలిపారు. నిమజ్జనాల నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు అధికారులు విగ్రహాలను నెక్లెస్‌రోడ్ వైపు మళ్లిస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
మరోవైపు హుస్సేన్‌సాగర్‌లో వేలాది గణనాథుల నిమజ్జనం కొనసాగుతోంది. నిమజ్జన ప్రక్రియను ఉదయం 11 గంటలలోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ అడ్వైజరీలను గమనించి, పోలీసులకు సహకరించాలని సీపీ సజ్జనార్ వాహనదారులు, ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: ప్యారడైజ్ పాట.. దానం ఆట!


