డబ్బు ఎంతైనా.. ప్రసాదం దక్కాల్సిందే | Hyderabad Ganesh Laddu Auctions, Keerthi Richmond Villas Laddu Fetches ₹1.01 Crore, Balapur Laddu Sold For ₹39 Lakh | Sakshi
Sakshi News home page

Ganesh Laddu Auctions: డబ్బు ఎంతైనా.. ప్రసాదం దక్కాల్సిందే

Sep 26 2026 8:35 AM | Updated on Sep 26 2026 1:23 PM

Keerthi Richmond Villas Vinayaka's Laddu Priced at Rs. 1.01 Crore

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ ఉత్సవాలకు దేశంలోనే హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యేకించి లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకోడానికి తీవ్రమైన పోటీ ఏర్పడుతోంది. ఈ ఏడాది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో గురువారం రూ.1.05 కోట్లు పలకగా.. శుక్రవారం బాలాపూర్‌ గణేష్‌ లడ్డూను రూ.39 లక్షలకు సామ ప్రణీత్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో రూ.2.31 కోట్లు (2025) పలికింది. 

అధిక మొత్తానికి వేలంలో లడ్డూ దక్కించుకున్న వారు 
ముసారాంబాగ్‌ శాలివాహన నగర్‌లో 51 కిలోల లడ్డూ రూ. 51 లక్షలు పలికింది. స్థానిక వ్యాపారి రాజేష్‌ గోయల్‌ ఈ లడ్డూను దక్కించుకున్నారు.   

  1. అత్తాపూర్‌:  రూ.13.21 లక్షలకు భూపాల్‌రెడ్డి 

  2. కూకట్‌పల్లి: రూ.7 లక్షలకు వడ్డేపల్లి రాజేశ్వరరావు 

  3. రామాంతపూర్‌:  రూ.6.51 లక్షలకు గరిక అశ్విన్

  4.  నానక్‌రాంగూడ:  రూ.6.11 లక్షలకు జక్కుల సహదేవ్, న్యూ 

  5. నాగోల్‌: రూ.5.30 లక్షలకు ఆవాల గీతా , రమేష్‌ రెడ్డి, 

  6. చంపాపేట్‌: రూ.4.41 లక్షలకు సామ బబ్రువాహన్‌ రెడ్డి, 

  7. ఎస్‌జీఆర్‌ కాలనీ:  రూ.3.80 లక్షలకు దేవరశెట్టి సందీప్‌ పటేల్, 

  8. శ్రీభాగ్యనగర్‌: రూ.3.55 లక్షలకు రాము, నారాయణ దాస్‌ సర్దార్‌ కుటుంబం, 

  9. ఉప్పల్‌ భగాయత్‌: రూ.3.17 లక్షలకు పద్మజ శ్రీనివాస్, 

  10. అలియాబాద్‌:  రూ.3.09 లక్షలకు తిరుపతి నాగరాజ్,  

  11. స్వరూప్‌నగర్‌:  రూ.2.05 లక్షలకు అడపు నరేందర్,  

  12. కుషాయిగూడ: మొదటి లడ్డూ రూ.2.05 లక్షలకు ప్రియా విశ్వప్రసాద్, రెండో లడ్డూ రూ.1.05 లక్షలకు కాంచన రామారావు, 

  13. ఛత్రినాక: రూ.1.86 లక్షలకు పుపాల కేదార్‌ రావు. 

ఇదీ చదవండి: Laya: నాతో అసలు పనిలేదు.. అయినాసరే తిరిగిచ్చేశారు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement