కూల్‌ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి | Woman Blackmailing Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

కూల్‌ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి

Sep 26 2026 10:03 AM | Updated on Sep 26 2026 10:53 AM

Woman Blackmailing Incident In Hyderabad

హైదరాబాద్‌: స్నేహంగా ఉన్నట్లు నటించి కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి లైంగిక దాడికి పాల్పడి వీడియోలు చిత్రీకరించాడు. ఆపై లాభాలు వస్తాయంటూ రూ.43 లక్షల పెట్టుబడి పెట్టించి తిరిగి డబ్బులు అడిగితే బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ భూపతి తెలిపిన మేరకు.. 

పటాన్‌చెరుకు చెందిన షేక్‌ నబీ(36) నాలెడ్జీ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో ఫుడ్‌ వెండర్‌గా పని చేస్తూ సమీపంలో బాక్స్‌ క్రికెట్‌ నిర్వహించేవాడు. అదే కంపెనీలో అడ్మిని్రస్టేషన్‌ ఆఫీసర్‌గా పని చేసే మహిళ(42) పరిచయమైంది. 2023లో బాక్స్‌ క్రికెట్‌ అడేందుకు సదరు కంపెనీ ఉద్యోగులు రాత్రి సమయంలో షేక్‌ నబీ నిర్వహించే బాక్స్‌ క్రికెట్‌కు వెళ్లారు. కూల్‌ డ్రింక్‌లో మత్తుమందు కలిపి  ఓ గదిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో వీడిమోలు, ఫొటోలు తీశాడు. 

ఆ వీడియోలను అడ్డు పెట్టుకొని లైంగిక దాడి కొనసాగిస్తూ రెస్టారెంట్‌లో పెట్టుబడి పెడితే లాబాలు వస్తాయని నమ్మించి రూ.43 లక్షలు పెట్టించాడు. డబ్బు తిరిగి వ్వాలని అడగడంతో వీడియోలు భర్త, పిల్లలకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. మూడేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడని, పెట్టుబడి పేరుతో రూ.43 లక్షలు మోసం చేశాడని బాధితురాలు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement