దేశంలో వెల్లుల్లి నగరం ఎక్కడుందో తెలుసా? | Which Place is Known as the Garlic city of India | Sakshi
Sakshi News home page

దేశంలో వెల్లుల్లి నగరం ఎక్కడుందో తెలుసా?

Sep 26 2026 1:03 PM | Updated on Sep 26 2026 1:03 PM

Which Place is Known as the Garlic city of India

న్యూఢిల్లీ: భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. చట్నీలు, తాలింపులు, మసాలా పేస్టులు ఇలా ఎన్నో రకాల వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తారు. అయితే దేశంలో ఓ ప్రాంతంలో వెల్లుల్లి సాధారణ పంట మాత్రమే కాదు.. అక్కడి రైతుల ఆర్థిక వ్యవస్థతో, ప్రాంతం గుర్తింపుతో ముడిపడిపోయింది. అదే మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్. దీనినే ‘భారత్‌లో వెల్లుల్లి నగరం’ గా పిలుస్తారు.

వెల్లుల్లి నగరంగా మంద్‌సౌర్
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ జిల్లాను కేంద్ర ప్రభుత్వ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వెల్లుల్లిని ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. దీంతో ఈ పంట స్థానిక రైతులకు కీలక ఆదాయ వనరుగా మారింది. మంద్‌సౌర్‌లో పండించే వెల్లుల్లికి ఘాటైన రుచి, వాసన, మంచి నాణ్యత ఉంటాయని చెబుతారు. ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితులు వెల్లుల్లి సాగుకు అనుకూలంగా ఉండటంతో పంటకు మంచి డిమాండ్‌ ఉంది. కొన్ని స్థానిక రకాల వెల్లుల్లిని ఎక్కువ కాలం నిల్వ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

మధ్యప్రదేశ్ దేశంలోని ప్రముఖ వెల్లుల్లి ఉత్పత్తి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ఒకటి. అందులో మంద్‌సౌర్ కీలక సాగు ప్రాంతంగా ఉంది. జిల్లాలో విస్తృతంగా వెల్లుల్లి సాగు జరుగుతుండటంతో ఈ పంట స్థానిక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మంద్‌సౌర్ వెల్లుల్లిని  పంటగా మాత్రమే విక్రయించరు. వెల్లుల్లి పొడి, వెల్లుల్లి నూనె, పేస్ట్, ఊరగాయలు, డీహైడ్రేటెడ్ ఫ్లేక్స్ వంటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. దీంతో రైతులు, వ్యాపారులకు కూడా వాణిజ్యపరమైన అవకాశాలు పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి: 21 గంటల ఊరేగింపు.. కడలికేగిన లాల్‌బాగ్చా రాజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement