ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్‌ | Asian Games 2026 Kabaddi, India Women Edge Past Iran In Thrilling Final And Clinch Gold, Check Out More Details | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్‌

Sep 26 2026 11:11 AM | Updated on Sep 26 2026 11:37 AM

Asian Games 2026 Kabaddi: India Women Edge Past Iran In Thrilling Final, Clinch Gold

source: X

ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. మహిళల కబడ్డీలో భారత జట్టు గోల్డ్‌ మెడల్‌ సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ భారత్‌ ఇరాన్‌ను 37-34తో ఓడించి, వరుసగా రెండో ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచింది.

ఫైనల్లో భారత జట్టు తొలి అర్ధభాగంలో ఆధిపత్యం ప్రదర్శించింది. విరామ సమయానికి 22-16తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఇరాన్‌ గట్టిగా పోరాడింది. ఆ దశలో ఇరాన్‌ 18-15తో ఆధిక్యం సాధించినప్పటికీ.. తొలి అర్ధభాగంలో భారత్‌ సాధించిన ఆరు పాయింట్ల ఆధిక్యం కీలకంగా మారింది.

చివరి నిమిషాల్లో ఇరాన్‌ వరుసగా పాయింట్లు సాధిస్తూ భారత్‌పై ఒత్తిడి పెంచింది. అయితే భారత డిఫెన్స్‌ కీలక సమయంలో పట్టు కోల్పోకుండా మ్యాచ్‌ను ముగించింది. చివరికి 37-34తో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

ఈ విజయంతో ఆసియా క్రీడల మహిళల కబడ్డీలో భారత్‌ నాలుగో స్వర్ణ పతకం సాధించింది. 2018 జకార్తా ఆసియా గేమ్స్‌లో మాత్రమే భారత్‌ స్వర్ణాన్ని కోల్పోయింది. ఆ ఏడాది ఇరాన్‌ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ భారత్‌ స్వర్ణం సాధించింది. తాజాగా ఇరాన్‌ను ఓడించి టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.

విజయం అనంతరం భారత క్రీడాకారిణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ‘వందే మాతరం’ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు.

కాగా, మహిళల కబడ్డీలో పతకంతో భారత్‌ ఖాతాలో మూడో స్వర్ణం, మొత్తంగా 27వ పతకం చేరింది. ప్రస్తుతం భారత్‌ పతకాల పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతోంది.  చైనా 169 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 

ఇదీ చదవండి: ఏషియన్‌ గేమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ది ఖరారు



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement