breaking news
Womens kabaddi
-
ప్రపంచకప్ విజేతలకు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సమష్టితత్వం, అంకితభావానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఆదివారం టీమిండియా 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘మొదటిసారి జరిగిన అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. ఓటమి ఎరగకుండా ట్రోఫీ నెగ్గడం మరింత గొప్పవిషయం. ఇది నిజంగా చారిత్రాత్మక విజయం. జట్టు సమష్టి కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం. ప్రతీ క్రీడాకారిణీ ఒక చాంపియన్. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సెమీస్‌లో ఆ్రస్టేలియాపై విజయం సాధించిన భారత్ అంతకుముందు లీగ్ దశలో శ్రీలంక, ఆ్రస్టేలియా, నేపాల్, అమెరికా, పాకిస్తాన్‌పై నెగ్గింది. అదే విధంగా.. మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నీలోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి వరుసగా రెండోసారి చాంపియన్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భారత మహిళా కబడ్డీ జట్టును కూడా అభినందించారు. -
కబడ్డీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఢాకా: ప్రపంచకప్ మహిళల కబడ్డీ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన మెగా టోర్నిలో రీతూ నేగి సారథ్యంలోని భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకొని మట్టి ఆటలో మన ఆధిక్యాన్ని చాటింది. సోమవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు 35–28 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీని చిత్తు చేసింది. మొత్తం 11 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ సెమీఫైనల్లో పటిష్ట ఇరాన్ జట్టును మట్టికరిపించిన మన అమ్మాయిలు... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించారు. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన భారత జట్టు... అటు రైడింగ్, ఇటు ట్యాక్లింగ్‌లో ఆకట్టుకుంది. 2012లో భారత్ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్‌లో ఇరాన్‌పై గెలిచి చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... ఇప్పుడు రెండో సారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం రాణించిన భారత జట్టు... ఫైనల్లో చైనీస్ తైపీపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. చక్కటి డిఫెన్స్‌తో పాటు... కీలక సమయాల్లో పాయింట్లు సాధిస్తూ పైచేయి కొనసాగించింది. కెపె్టన్ రీతూ నేగి అన్నీ తానై జట్టును నడిపించగా... వైస్ కెపె్టన్ పుష్ప తన రైడింగ్‌తో కట్టిపడేసింది. జట్టుకు అవసరమైనప్పుడల్లా పాయింట్లు సాధించి ట్రోఫీ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. హెడ్ కోచ్ తేజస్వి ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా... చక్కటి సమన్వయం, సమష్టితత్వంతో కట్టిపడేసింది. తుది పోరు ఆరంభంలో చైనీస్ తైపీ గట్టి ప్రతిఘటన కనబర్చే ప్రయత్నం చేసింది. అయితే పట్టువదలని టీమిండియా మ్యాచ్ 13వ నిమిషంలో ప్రత్యరి్థని ఆలౌట్ చేసి 18–15తో ముందంజ వేసింది. ఈ దశలో భారత కెపె్టన్ రీతూ నేగి గాయపడటంతో ఉత్కంఠ పెరిగినా... ఎక్కడా ఒత్తిడికి గురికాని టీమిండియా ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ మ్యాచ్‌పై పట్టు సాధించి జగజ్జేతగా నిలిచింది. రీతూ, పుష్పతో పాటు చంపా ఠాకూర్, భావన ఠాకూర్, సాక్షి శర్మ భారత విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. వరుసగా రెండోసారి ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టుకు అన్నివైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు భారత మహిళల విజయాన్ని శ్లాఘించారు. -
భారత మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ప్రపంచకప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత మహిళా కబడ్డీ జట్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్‌కప్ టైటిల్ గెలిచి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు.క్రమశిక్షణ, అంకిత భావానికి నిదర్శనంవరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడం మన అమ్మాయిల క్రమశిక్షణ, ఆట పట్ల వారికి ఉన్న నిబద్ధత, సమిష్టితత్వానికి నిదర్శనమని వైఎస్ జగన్ ప్రశంసించారు. క్రీడా రంగంలో మన మహిళలు వరుస విజయాలతో దూసుకుపోతూ దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి స్ఫూర్తిదాయకంగా నిలవాలంటూ భారత మహిళా కబడ్డీ జట్టును అభినందించారు.వరుసగా రెండోసారికాగా బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా మహిళల కబడ్డీ ప్రపంచకప్-2025 ఫైనల్లో భారత జట్టు.. చైనీస్ తైపీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. పన్నెండు జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో భారత్.. గ్రూప్ దశ నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టైటిల్ కైవసం చేసుకుంది. భారత్‌కు వరుసగా ఇది రెండో టైటిల్ కావడం విశేషం. Hearty congratulations to our Indian Women’s Kabaddi Team for winning the World Cup and making the nation proud. Winning the world championship for the second time in a row shows the discipline, determination and teamwork of our girls.It is truly heartening to see women in… pic.twitter.com/BFgv4u0AQg— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2025 -
కబడ్డీ వరల్డ్‌కప్ విజేతగా భారత్
మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ గెలుపు జెండా ఎగురవేసింది. చైనీస్ తైపీతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో తైపీని చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించింది.వరుసగా రెండోసారిబంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన టైటిల్ పోరులో భారత్ తొలి అర్ధ భాగంలో 20-16తో ఆధిక్యం సంపాదించింది. సంజూ దేవి సూపర్ రెయిడ్‌లో నాలుగు పాయింట్లు తెచ్చి సత్తా చాటగా.. సారథి రీతూ నేగి ట్యాకిల్‌కు యత్నించి గాయపడింది. ఇక సెకండాఫ్‌లోనూ భారత్ తమ పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నించింది. అయితే, చైనీస్ తైపీ కూడా అంత తేలికగా తలొగ్గలేదు.సమయం ముగియడానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందన్న సమయంలోనూ చైనీస్ తైపీ పోరాట పటిమ కనబరిచింది. అయితే, భారత జట్టు వారికి మరో అవకాశం ఇవ్వలేదు. 35-28తో చైనీస్ తైపీని ఓడించి జగజ్జేతగా అవతరించింది. తద్వారా..డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్ టైటిల్ సొంతం చేసుకుని సత్తా చాటింది.గుత్తాధిపత్యం మనదేకాగా భారత పురుషుల కబడ్డీ జట్టు కూడా ఇప్పటికి మూడు ప్రపంచకప్ టోర్నీలు జరుగగా.. మూడింట చాంపియన్‌గా నిలిచింది. మహిళా జట్టు సైతం అదే పరంపరను కొనసాగించడం విశేషం. ఇప్పటికి ఓవరాల్‌గా ఐదు ప్రపంచకప్ టోర్నీ (3 పురుష, 2 మహిళలు)లు జరుగగా ఐదింట భారత్‌దే విజయం. కబడ్డీలో మన గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నందుకు ఇరుజట్లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఆఖరి వరకు అజేయంగాఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భారత్ అన్ని మ్యాచ్‌లు గెలిచింది, గ్రూప్-‘ఎ’ నుంచి నాలుగుకు నాలుగు గెలిచి అజేయంగా నిలిచింది. మరోవైపు.. గ్రూప్-‘బి’లో చైనీస్ తైపీ సైతం ఐదు మ్యాచ్‌లలోనూ గెలిచింది. ఇక సెమీ ఫైనల్లో భారత్ ఇరాన్‌ను 33-21 పాయింట్ల తేడాతో ఓడించగా.. మరో సెమీస్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ బంగ్లాదేశ్‌పై 25-18 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇలా ఇరుజట్లు ఫైనల్ చేరగా భారత్- చైనీస్ తైపీపై గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది. కాగా ఈ మెగా కబడ్డీ ఈవెంట్లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొన్నాయి. ఆసియా నుంచి భారత్, ఇరాన్, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ, నేపాల్, థాయ్‌లాండ్ భాగం కాగా.. ఆఫ్రికా నుంచి కెన్యా, ఉగాండా, జాంజిబార్.. యూరోప్ నుంచి పోలాండ్, జర్మనీ.. దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా పాల్గొన్నాయి.మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నీ-2025లో పాల్గొన్న భారత జట్టురీతూ నేగి (కెప్టెన్), పుష్ఫ రాణా (వైస్ కెప్టెన్), సొనాలి షింగాటే, పూజా నర్వాల్, భావనా ఠాకూర్, సాక్షి శర్మ, పూజా కజ్లా, చంపా ఠాకూర్, రీతూ షోరేన్, రీతూ మిథర్వాల్, సంజూ దేవి, ధనలక్ష్మి, అనూ కుమారి.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్🚨 THIS IS PRETTY HUGE NEWS FOLKS 💥WORLD CUP WINNING MOMENTS FOR INDIA 🏆Indian Women's Team defeated Chinese Taipei 35-28 in the Finals of Kabaddi World Cup 2025!Our Girls successfully defends the Trophy 🇮🇳💙 pic.twitter.com/rEp45Qu6aW— The Khel India (@TheKhelIndia) November 24, 2025 -
Khelo India Youth Games: కబడ్డీలో రైతుబిడ్డల విజయగర్జన
పంచకుల (హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ (ఏపీ) అమ్మాయిల కూత అదిరింది. హరియాణాలో జరుగుతున్న ఈ క్రీడల్లో అండర్–18 మహిళల కబడ్డీలో తెలుగు రైతుబిడ్డలు గర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆడుతున్న 12 మందిలో పది మంది రైతు కూలీ బిడ్డలే ఉండటం గమనార్హం. వీరంతా విజయనగరం జిల్లాలోని కాపుసంభం గ్రామం నుంచి వచ్చారు. ఈ జిల్లాకు చెందిన వందన సూర్యకళ ఖేలో ఇండియా కబడ్డీలో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తోంది. ‘బి’ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 40–28తో చత్తీస్‌గఢ్‌ను ఓడించింది. ఇందులో ఏపీ రెయిడర్ సూర్యకళ 14 పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఏపీ రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూర్యకళ మాట్లాడుతూ ‘అవును నేను రైతు కూలీ బిడ్డనే. రైతు బిడ్డలమైనందుకు గర్వంగా ఉంది. మనందరి పొద్దు గడిచేందుకు వృత్తి ఉంటుంది. అలాగే మా తల్లిదండ్రుల వృత్తి కూలీ చేసుకోవడం! నిజానికి నేను ఓ రన్నర్‌ను... చిన్నప్పుడు స్ప్రింట్‌పైనే ధ్యాస ఉండేది. ఏడేళ్లపుడు మా స్నేహితులంతా కబడ్డీ ఆడటం చూసి ఇటువైపు మళ్లాను’ అని చెప్పింది. -
మహిళా కబడ్డీలోనూ నిరాశే!
జకార్త: భారత మహిళల కబడ్డీ జట్టు హ్యాట్రిక్ స్వర్ణం మిస్సయ్యింది. ఏషియన్స్ గేమ్స్‌లో భాగంగా శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళలు 24-27 తేడాతో తృటిలో పసిడిని చేజార్చుకున్నారు. ఒకవైపు పురుషుల జట్టు తొలిసారి సెమీఫైనల్లో ఓడి నిరాశపరచగా.. మహిళలు సైతం ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. హోరాహొరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరాన్ మహిళలే పై చేయి సాధించారు. అద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈమ్యాచ్‌కు ఇరు దేశాల పురుషుల జట్లు హాజరై తమ జట్లకు మద్దతు పలికాయి. మ్యాచ్ సందర్భంగా పురుషుల జట్టు కెప్టెన్ అజయ్ ఠాకుర్ కన్నీటీ పర్యంతమయ్యాడు. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండు సార్లు భారత మహిళలే స్వర్ణం సాధించారు. తొలిసారి ఇరాన్ మహిళల జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఇక భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 5 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. -
ఏషియన్ గేమ్స్‌లో భారత్ శుభారంభం
జకార్తా: ఏషియన్ గేమ్స్-2018లో భారత మహిళల కబడ్డీ జట్టు శుభారంభం చేసింది. జపాన్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో 42-12 తేడాతో ఘనవిజయం సాధించింది. మమతా పుజారి నేతృత్వంలోని భారత మహిళల జట్టు తొలి నుంచి ఆధిపత్యం కనబర్చింది. ఈ మ్యాచ్‌లో జపాన్ మహిళలు ఏదశలోనూ డిఫెండింగ్ చాంపియన్‌కు పోటీనివ్వలేకపోయారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలోని జలోరా బంగ్ కర్నొ స్టేడియంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7 గంటలకు పద్దెనిమిదో ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక పురుషుల కబడ్డీ జట్టు తొలి మ్యాచ్ శ్రీలంకతో సాయంత్రం 5.30కు ప్రారంభం కానుంది. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ (రవి కుమార్, అపూర్వీ చండేలా)లు ఫైనల్‌కు చేరింది. -
విజేత ఓయూ మహిళా కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి మహిళల కబడ్డీ టోర్నమెంట్లో కోఠి మహిళా యూనివర్సిటీ కాలేజి జట్టు సత్తా చాటింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో యూనివర్సిటీ కాలేజి జట్టు 43–30తో కస్తూర్బా గాంధీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో యూనివర్సిటీ కాలేజి 42–11తో ఆంధ్ర మహిళా సభపై, కస్తూర్బా జట్టు 57–15తో భవన్స్ సైనిక్‌పురి జట్టుపై విజయం సాధించాయి. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భవన్స్ జట్టుపై ఆంధ్రమహిళా సభ గెలుపొందింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి టోర్నమెంట్ (ఐసీటీ) డైరెక్టర్ బి. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రశాంత ఆత్మ, కబడ్డీ సాయ్ కోచ్ కె. శ్రీనివాస్ రావు, ఓయూసీడబ్ల్యూ కార్యనిర్వాహక కార్యదర్శి వి. దీపిక రావు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకూ కబడ్డీ లీగ్
నేటి నుంచి ప్రారంభం ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ తరహాలో నేటి (మంగళవారం) నుంచి మహిళల కబడ్డీ చాలెంజ్ ప్రారంభం కానుంది. ఇందులో మూడు జట్లు పాల్గొంటున్నాయి. ఫైర్ బర్డ్స్‌కు మమతా పూజారి, ఐస్ డివాస్‌కు అభిలాష మాత్రే, స్టార్మ్ క్వీన్స్‌కు తేజస్విని బాయ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ప్రొ కబడ్డీ లీగ్ జరిగే వేదికల్లోనే ఈ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. పోటీ 30 నిమిషాలపాటు సాగుతుంది. ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, పుణేలలో మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 31న ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్‌తో పాటే ఈ పోటీల తుది పోరు కూడా జరుగుతుంది. మ్యాచ్‌లు స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. -
30 నుంచి రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీలు
కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా) : రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలను ఈ నెల 30, 31, జూన్ 1 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కొల్లులో నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. పోటీల పోస్టర్‌ను కాకినాడలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. బస్వా చినబాబు స్మారకార్థం ఈ పోటీలను పార్టీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభిస్తారన్నారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు జరుగుతాయన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంత ఉదయ్ భాస్కర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి పాపారాయుడు, నాయకులు శెట్టిబత్తుల రాజబాబు, జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, పోటీల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు వీవీబీ ప్రసాద్, సెక్రటరీ గంధం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


