దేశం గర్వించేలా మహిళా కబడ్డీ  | Womens Kabaddi Press Meet | Sakshi
Sakshi News home page

దేశం గర్వించేలా మహిళా కబడ్డీ 

Mar 1 2026 6:10 AM | Updated on Mar 1 2026 6:10 AM

Womens Kabaddi Press Meet

సుమన్, ఆక్సా ఖాన్, తులసి, ఇండియన్‌ ఉమెన్స్‌ కబడ్డీ టీమ్‌ వైస్‌ కెప్టెన్‌ పూజ నర్వాల్, ఇండియన్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌ శ్రీనివాస్‌ రెడ్డితో  పాటు ఏడుగురు రియల్‌ కబడ్డీ ప్లేయర్స్‌ కీలక  పాత్రల్లో నటించనున్న చిత్రం ‘మహిళా కబడ్డీ’. 

ప్రతాని రామకృష్ణ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ఇది. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుమన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో కూతుర్ని కబడ్డీ ప్లేయర్‌గా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే తండ్రి  పాత్రలో నటిస్తున్నాను. పల్లెటూరి పేద ఫ్యామిలీ అమ్మాయి కబడ్డీలో దేశం గర్వించేలా ఎంత కష్టపడి ఎదిగింది? అన్నది ఈ సినిమాలో చూస్తారు’’ అని చె ప్పారు. ‘‘నేను కూడా కబడ్డీ ప్లేయర్‌నే. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. 

త్వరలో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అని పేర్కొన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్‌. ‘‘ఆర్కే గౌడ్‌ ఈ సినిమా కోసం నన్ను, పూజ నర్వాల్‌ని అ్ర΄ోచ్‌ అయ్యారు. మేం ఇద్దరం ఈ సినిమాలో నటిస్తున్నాం. క్రికెట్‌లో మహిళల జట్టు ఎలా రాణిస్తున్నారో, కబడ్డీలోనూ అలాగే ప్రతిభ చాటుతున్నారు’’ అన్నారు శ్రీనివాస్‌ రెడ్డి. ‘‘కబడ్డీని ప్రొఫెషనల్‌గా ఎంచుకునే అమ్మాయిలకు మంచి భవిష్యత్‌ ఉంది. ఇలాంటి టైమ్‌లో ‘మహిళా కబడ్డీ’ సినిమాను ఆర్కే గౌడ్‌ రూ పొందిస్తుండటం, ఇందులో నేను నటిస్తుండటం హ్యాపీగా ఉంది’’ అని చె ప్పారు పూజ నర్వాల్‌. ‘‘ఇందులో కబడ్డీ ప్లేయర్‌గా చేస్తున్నాను’’ అన్నారు ఆక్సా ఖాన్‌. కబడ్డీ ప్లేయర్‌ రాధికా రెడ్డి, నటి తులసి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement