ఆస్ట్రోనాట్ అవ్వాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓ మహిళ ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటంతో రూపొందుతున్న చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. రియల్ లైఫ్ కపుల్ వరుణ్ సందేశ్, వితికా షేరు జంటగా నటిస్తున్న చిత్రం ఇది.
మనస్వినీ భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ‘‘చిన్నప్పట్నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ కథే ఈ చిత్రం. సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం నేటి తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. వరుణ్ సందేశ్, వితికా షేరుల అద్భుత నటన, కార్తీక్ కొడకండ్ల సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.


