హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. విడుదలపై ప్రకటన | Kalidas 2 movie release date announced | Sakshi
Sakshi News home page

హిట్‌ సినిమాకు సీక్వెల్‌.. విడుదలపై ప్రకటన

Mar 10 2026 6:39 AM | Updated on Mar 10 2026 6:39 AM

Kalidas 2 movie release date announced

ప్రేమిస్తే మూవీతో పాపులర్‌ అయిన నటుడు భరత్‌ హీరోగా నటించిన కాళిదాస్‌ చిత్రం 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో దానికి సీక్వెల్‌గా ఇప్పుడు కాళిదాస్‌–2 చిత్రం రూపొందింది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన శ్రీసెంథిల్‌నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భరత్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో మరో కీలక పాత్రను అజయ్‌కార్తీ పోషించారు.

పూవే ఉనక్కాగ(poove unakkaga) చిత్రం ఫేమ్‌ సంగీత చాలా గ్యాప్‌ తరువాత ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు. ఆమెతో పాటు భవానిశ్రీ, అపర్ణ నటించారు. తొలి భాగం తరహాలోనే కుటుంబ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.

ఈ చిత్రాన్ని స్కై పిక్చర్స్‌ అధినేత  ఫైవ్‌స్టార్‌ కె.సెంథిల్, డా. యోగేశ్వరన్‌ కలసి నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 3న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం అన్నివర్గాలను అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రానికి శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని, సురేశ్‌బాలా చాయాగ్రహణం అందించారు. ఈ మూవీ తెలుగులో కూడా విడుదల కావచ్చని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement