వ్యోమగామిగా వితికా శేరు.. ఆసక్తికరంగా గ్లింప్స్ | Vithika Sheru Movie Dear Astronaut Birthday Glimpse out now | Sakshi
Sakshi News home page

Dear Astronaut Movie: వ్యోమగామిగా వితికా శేరు.. ఆసక్తికరంగా గ్లింప్స్

Feb 2 2026 10:10 PM | Updated on Feb 2 2026 10:10 PM

Vithika Sheru Movie Dear Astronaut Birthday Glimpse out now

వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం డియర్‌ ఆస్ట్రోనాట్‌. ఈ మూవీకి కార్తిక్‌ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వితికా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో వితికా శేరు భర్త వరుణ్‌ సందేశ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఇవాళ వితికా శేరు బర్త్‌ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. 

తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీలో ఆస్ట్రోనాట్‌గా వితికా షేరు కనిపించనున్నారు. అంజలి అనే వ్యోమగామి పాత్రలో మెప్పించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన గ్లింప్ల్ విజువల్స్‌ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీని  యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైత్ర పెద్ది, గీతా భాస్కర్, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల సంగీతమందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement