దేవగుడి సక్సెస్‌.. ఆనందంగా ఉందన్న డైరెక్టర్‌ | Devagudi Movie has success with the appreciation of audiences | Sakshi
Sakshi News home page

Devagudi Movie: దేవగుడి సక్సెస్‌.. ఆనందంగా ఉందన్న డైరెక్టర్‌

Feb 2 2026 9:49 PM | Updated on Feb 2 2026 9:49 PM

Devagudi Movie has success with the appreciation of audiences

అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం దేవగుడి. ఈ మూవీని బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.

దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందని ప్రశంసలు వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్‌గా వచ్చాయి. అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనతో కూడా అందరిని ఆకట్టుకున్నారు. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారని' అన్నారు.

హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ..' కొన్నేళ్లుగా హీరో కావాలనే కలను ఈ సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయాను. థియేటర్స్‌లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ క్రెడిట్ అంతా మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డికే చెందుతుంది. మీ ఆదరణ మా సినిమా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. 'ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా మీ ముందుకు వచ్చా. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి  అని పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు. ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు' అని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement