ఐరన్‌ హ్యాండ్‌  | Allu Arjun to lead Lokesh Kanagaraj next dream project | Sakshi
Sakshi News home page

ఐరన్‌ హ్యాండ్‌ 

Jan 22 2026 4:55 AM | Updated on Jan 22 2026 4:55 AM

Allu Arjun to lead Lokesh Kanagaraj next dream project

 – వరుసగా  ప్రయోగాత్మక పాత్రల్లో...

సూపర్‌ హిట్‌ ‘పుష్ప 1, 2’ చిత్రాల్లో అల్లు అర్జున్‌ భుజం పైకి ఎత్తి, వెరైటీగా వాక్‌ చేస్తూ ఓ కొత్త మేనరిజమ్‌తో ఆకట్టుకున్నారు. మరోసారి సవాల్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్‌. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్‌ హీరో తరహా పాత్ర చేయనున్నారట అల్లు అర్జున్‌. ‘ఐరన్‌ హ్యాండ్‌’తో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. 

ఈ సినిమాలో ఓ ప్రమాదంలో హీరో చేయి కోల్పోతాడట. ఆ తర్వాత ఐరన్‌ హ్యాండ్‌తో ప్రత్యర్థులపై చేసే పోరాటం ఉత్కంఠభరితంగా ఉంటుందని టాక్‌. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న భారీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో అల్లు అర్జున్‌ పలు పాత్రల్లో (తాత, అతని కొడుకు, ఇద్దరు మనవళ్ల పాత్రలు) కనిపించనున్నారని భోగట్టా. ఆ వెంటనే లోకేశ్‌ సినిమాలో ప్రయోగాత్మక పాత్రతో రానున్నారు. ఇలా వరుసగా అల్లు అర్జున్‌ ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్‌ అట్లీతో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌..  ఈ చిత్రం పూర్తయ్యే సమయానికి లోకేశ్‌ కనగరాజ్‌తో చేయనున్న సినిమా షూట్‌లో ఎంటర్‌ అవుతారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement