ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా | School Life Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: స్కూల్ బ్యాక్‌డ్రాప్ ప్రేమకథ.. ఓటీటీలో స్ట్రీమింగ్

Feb 28 2026 9:19 PM | Updated on Feb 28 2026 9:19 PM

School Life Movie OTT Streaming Now

ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా హనీ, అక్యూజ్జ్, హాట్ స్పాట్ 2 తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు తమిళ, మలయాళ మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు, రోస్లిన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అలానే విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్'.. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి మరో తెలుగు సినిమా కూడా వచ్చి చేరింది.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

'స్కూల్ లైఫ్' పేరుతో తీసిన తెలుగు మూవీ.. గతేడాది నవంబరు 28న అంటే మూడు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చింది. సుమన్, ఆమని తదితరులు ఇందులో కీలక పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం.. కంటెంట్ కూడా అంతంత మాత్రమే ఉండేసరికి ఇదొకటి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది.

'స్కూల్ లైఫ్' విషయానికొస్తే.. 1990ల్లో రాయలసీమలోని ఓ పల్లెటూరి నేపథ్యంగా సాగుతుంది. స్కూల్ లవ్ స్టోరీతో మొదలై.. అక్కడి ప్రాంత ప్రజల మధ్య కులం, కుటుంబ గౌరవం, పగ తదితర అంశాలు ఎలాంటి పాత్ర పోషించాయి. ప్రేమతో మొదలై పగతో ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా స్టోరీ. పులివెందుల మహేశ్ అనే కుర్రాడు.. హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు.

(ఇదీ చదవండి: రష్మిక రీల్ బ్రదర్ హీరోగా సినిమా.. ట్రైలర్ రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement