మంచు విష్ణుకు దుబాయ్‌లో మిస్సైల్ పేలుడు అనుభవం | Manchu Vishnu experiences missile explosion in Dubai | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: మంచు విష్ణుకు దుబాయ్‌లో మిస్సైల్ పేలుడు అనుభవం

Mar 1 2026 12:23 AM | Updated on Mar 1 2026 12:37 AM

Manchu Vishnu experiences missile explosion in Dubai

దుబాయ్‌లో కుటుంబంతో ఉన్న హీరో మంచు విష్ణు తాజాగా జరిగిన మిస్సైల్ పేలుడు సమయంలో తన ఇల్లు కంపించిందని, ఆ క్షణం తీవ్ర భయానకంగా అనిపించిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

మిస్సైల్ పేలుడు కారణంగా మా ఇల్లు షేక్ కావడం వల్ల మేము తీవ్రంగా భయపడ్డాం. శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా తమ ఇళ్ల పైకప్పు పైన యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యుఎఇ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం ఎంత దుర్బలమైనదో గుర్తు చేస్తాయి. శక్తి, శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. హర్ హర్ మహాదేవ్ అంటూ మంచు విష్ణు తన ట్వీట్‌ను ముగించారు. యుద్ధ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఎదుర్కొనే భయాన్ని ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి.  

 

Advertisement
 
Advertisement
Advertisement