సౌత్ సినిమాపై రాధికా ఆప్టే కామెంట్స్.. నెటిజన్స్ ఫైర్ | Netizens Fire On actress Radhika Apte Comments about her south film | Sakshi
Sakshi News home page

Radhika Apte: రాధికా ఆప్టే కామెంట్స్.. ఆ విషయం ముందే తెలియదా?

Nov 4 2026 12:15 AM | Updated on Nov 4 2026 12:15 AM

Netizens Fire On actress Radhika Apte Comments about her south film

సౌత్ సినిమా ఇండస్ట్రీపై బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఓ సినిమాను ప్రస్తావిస్తూ ఆమె తన రోల్ గురించి మాట్లాడారు. ఓ సినిమాలో తన పాత్రను బంధువుతో పెళ్లికి సిద్ధం చేయడం.. తనకంటే చాలా పెద్ద వయసున్న హీరోతో జోడీగా నటించడం.. సినిమా మధ్యలోనే తన పాత్రను చంపేశారంటూ రాధిక ఆరోపించారు. అయితే ఆమె నేరుగా సినిమా పేరు చెప్పకపోయినప్పటికీ అది బాలయ్య హీరోగా వచ్చిన లెజెండ్ మూవీ అని సినీ ప్రియులకు అర్థమవుతోంది. దీంతో కథ నచ్చనప్పుడు సినిమా ఎందుకు అంగీకరించారంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. స్క్రిప్ట్ ముందే మీకు వినిపించిన ఉంటారు కదా అని ప్రశ్నిస్తున్నారు.

ముంబైకి చెందిన రాధిక ఆప్టే.. కెరీర్ ప్రారంభంలో అంటే 10-12 ఏళ్ల క్రితం తెలుగులో లెజెండ్, లయన్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. అయితే దక్షిణాది ఇండస్ట్రీల్లో హీరోల డామినేషన్ గురించి ఎప్పటికప్పుడు రాధిక ఆప్టే విమర్శలు చేస్తూనే ఉంటోంది. తాజాగా తాను నటించిన 'అక్క' సిరీస్ ప్రమోషన్లలో భాగంగా పరోక్షంగా 'లెజెండ్' చిత్రం అందులోని సన్నివేశాల గురించి మాట్లాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement