సెన్సార్‌ నిబంధనలు మరింత కఠినం | CBFC tightens certification rules: Release dates wonot expedite clearance and titles may change | Sakshi
Sakshi News home page

సెన్సార్‌ నిబంధనలు మరింత కఠినం

Nov 3 2026 4:15 AM | Updated on Nov 3 2026 4:15 AM

CBFC tightens certification rules: Release dates wonot expedite clearance and titles may change

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌’(సీబీఎఫ్‌సీ) సినిమాల సర్టిఫికేషన్‌ జారీ విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. సీబీఎఫ్‌సీ చైర్మన్‌గా శశి శేఖర్‌ వెంపటి బాధ్యతల చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఫైనల్‌ వెర్షన్‌ మూవీస్‌కి మాత్రమే సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని, టైటిల్‌ ఆమోదం, విడుదల తేదీల విషయంలోనూ కొత్త మార్గదర్శకాలను పాటించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

కొత్త మార్గదర్శకాలను సీబీఎఫ్‌సీ సీఈఓ రాజేంద్ర సింగ్‌ విడుదల చేశారు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకునే నిర్మాతలు కచ్చితంగా ఫైనల్‌ వెర్షన్‌ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. గ్రాఫిక్స్, టైటిల్స్, క్రెడిట్స్, సబ్‌ టైటిల్స్, డిస్‌ క్లయిమర్, సెన్సార్‌ సర్టిఫికెట్‌ స్లాట్‌ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. సెన్సార్‌ ఆమోదం పొందిన ఫైనల్‌ వెర్షన్  ని మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలి. టైటిల్‌ రిజిస్టర్‌ అయినంత మాత్రాన దానికి సెన్సార్‌ ఆమోదం లభించినట్టు కాదు.

ఎగ్జామింగ్‌ కమిటీ, రివైజింగ్‌ కమిటీ టైటిల్‌ పరిశీలించిన తర్వాత ఆమోదిస్తేనే ఖరారు అయినట్టు. సినిమా విడుదల తేదీని ముందుగా ప్రకటించినప్పటికీ దాన్ని పరిగణనలోకి తీసుకుని సినిమాను ఎగ్జామిన్‌ చేయడం వీలుకాదు. నిర్మాతలు తమ విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే సెన్సార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. సెన్సార్‌ బోర్డు ఆదేశాలను పాటించడానికి అవసరమైన సమయాన్ని సైతం నిర్మాతలు ముందుగానే దృష్టిలో పెట్టుకుని, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement