‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు​.. ఈ నెల 5న ఎంగేజ్‌మెంట్‌!? | Sai Durga To Get Married In December, News Goes Viral | Sakshi
Sakshi News home page

‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు​.. ఈ నెల 5న ఎంగేజ్‌మెంట్‌!?

Nov 2 2026 9:05 PM | Updated on Nov 2 2026 9:09 PM

Sai Durga To Get Married In December, News Goes Viral

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మెగనున్నాయా? అంటే అవుననే అంటోది టాలీవుడ్‌ . త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి దుర్గ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. సోషల్‌ మీడియాలో, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నవంబర్‌ 5న సాయి దుర్గతేజ్‌ ఎంగేజ్‌మెంట్‌ జరగబోతుంది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు అతికొద్ది మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారట.

(చదవండి: అమిషాతో చిరంజీవి, రామ్‌ చరణ్‌ భేటీ!)

డిసెంబర్‌లో సాయి దుర్గ తేజ్‌ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే వధువు ఎవరనేది మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. చిత్ర పరిశ్రమతో సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థంతో పాటు పెళ్లి కూడా హైదరాబాద్‌లోనే చేసుకోవాలని సాయి దుర్గతేజ్‌  భావిస్తున్నాడట. ఇదంతా సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ప్రచారమే. మరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ అనేది తెలియాలంటే.. మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement