అమిషాతో చిరంజీవి, రామ్‌ చరణ్‌ భేటీ! | Chiranjeevi And Ram Charan Meets Home Minister Amit Shah At Hyderabad | Sakshi
Sakshi News home page

అమిషాతో చిరంజీవి, రామ్‌ చరణ్‌ భేటీ!

Nov 2 2026 4:50 PM | Updated on Nov 2 2026 5:44 PM

Chiranjeevi And Ram Charan Meets Home Minister Amit Shah At Hyderabad

ఫైల్‌ ఫోటో

 హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. పాదయాత్రలో పాల్గొనేకంటే ముందు పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌ చరణ్‌  కూడా ఉన్నారు. వీరిద్దరు  బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయకు చేరుకుని కేంద్ర మంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 

(చదవండి: అభిమానుల కోసం బిగ్‌బీ బిగ్‌ రిస్క్‌.. బెదిరింపులు వచ్చినప్పటికీ..)

హోటల్‌కు విచ్చేసిన చిరు, రామ్‌చరణ్‌ను అమిత్ షా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం అమిత్‌ షా నిజాం కాలేజీ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర లో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement