నాలుగేళ్ల క్రితం మన జీవితం ఇక్కడే మొదలైంది | Tamil Actress Mahalakshmi Latest Post Husband Ravinder | Sakshi
Sakshi News home page

Tamil Actress Mahalakshmi: తిరుపతిలో మొదలైన నటి ప్రేమకథ.. క్యూట్ పోస్ట్

Nov 2 2026 2:56 PM | Updated on Nov 2 2026 3:17 PM

Tamil Actress Mahalakshmi Latest Post Husband Ravinder

తమిళ సీరియల్ నటి మహాలక్ష్మి తిరుమల శ్రీవారిని భర్తతో కలిసి దర్శించుకుంది. ఈ సందర్భంగా భర్త దగ్గర నుంచి దొరుకుతున్న ప్రేమ గురించి క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టింది. తమ బంధాన్ని విమర్శించిన వాళ్లకూ పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: చిన్న వయసులోనే చనిపోయిన సీరియల్ నటుడు)

తమిళ నటి మహాలక్ష్మి.. 2022లో తమిళ నిర్మాత రవీందర్‌ని పెళ్లి చేసుకుంది. అయితే ఈమె.. అతడిని డబ్బుల కోసమే వివాహమాడింది. కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోతారు అని చాలామంది చాలా రకాలు కామెంట్స్ చేశారు. అయితే రీసెంట్‌గా తమ నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని తిరుమలలో సెలబ్రేట్ చేసుకుంది. తమ ప్రేమ బంధం ఇక్కడే మొదలైందని జరుపుకున్నారు.

'నాలుగేళ్ల క్రితం మన ప్రయాణం, మన జీవితం, ఓ కొత్త ప్రారంభం ఇక్కడే తిరుపతిలో మొదలైంది. ప్రేమ అంటే ఇతరులు ఏం చూస్తున్నారు. ఏమంటున్నారు. ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారనేది కూదా. మనం ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటున్నాం. ఎంతలా ప్రేమిస్తున్నాం, ఒకరినొకరు ఎంతలా పట్టించుకుంటున్నాం. ఎలా కాపాడుకుంటున్నాం అనేది ముఖ్యం. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటాం. ఒకరినొకరం తోడుగా ఉంటాం. ఒకరినొకరు కాపాడుకుంటాం' అని మహాలక్ష్మి క్యూట్ పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ లేడీ కంటెస్టెంట్ లవ్.. పేరెంట్స్ ఎంట్రీతో మారిన సీన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement