ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ మరో పదిరోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని, కళానిధి మారన్ వారసురాలు కావ్య మారన్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. నవంబర్ 10-11 తేదీల్లో గ్రీస్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అదలా ఉండగానే ఇప్పుడు చెన్నైలో పెళ్లి సందడి మొదలైపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ)
వివాహానికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ ప్రస్తుతం అనిరుధ్ ఇంట్లో జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులోనే డప్పుపై కూర్చుని అనిరుధ్ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇకపోతే గ్రీస్‌లో జరిగే పెళ్లికి వధూవరుల కుటుంబాలతో పాటు రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఫ్యామిలీస్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 21వ తేదీన చెన్నైలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీ, తమిళనాడు సీఎం విజయ్, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. అలానే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ వెళ్లే అవకాశముంది.
మరోవైపు అనిరుధ్-కావ్య పెళ్లి కార్డ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. వీటి కోసం లక్షల రూపాయల ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: విశ్వక్ సేన్ '#కల్ట్' సినిమా రివ్యూ)
#Anirudh - #KavyaMaran Wedding Reception Invitation 😳😮👌🏻 https://t.co/cokZ8dc0GQ
— VCD (@VCDtweets) October 29, 2026
Anirudh – Kavya Maran’s wedding invitation is grabbing attention! The wedding invitation featuring the duo has sparked interest among fans on social media. #Anirudh #KavyaMaran #WeddingInvitation #CelebrityWedding #Telanganaahead https://t.co/WSyH9G90V7
— Telangana Ahead (@telanganaahead) October 29, 2026


