హీరోగా విజయ్ తనయుడి ఎంట్రీ.. ‍అల్లు అర్జున్‌ డైరెక్టర్‌తోనే..! | Jason Sanjay Hero entry Director name Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Jason Sanjay: అల్లు అర్జున్‌ డైరెక్టర్‌తో జేసన్ సంజయ్ ఎంట్రీ..!

Oct 29 2026 8:25 PM | Updated on Oct 29 2026 9:00 PM

Jason Sanjay Hero entry Director name Goes Viral In Social Media

ఇటీవలే సిగ్మా మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించారు. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్‌ జేసన్ సంజయ్‌ను నిరాశకు గురిచేసింది. ఈ ఫలితంతో ఎంట్రీ మూవీతోనే సంజయ్‌ హిట్ అందుకోలేకపోయాడు. ఇది ఆయన అభిమానులను సైతం నిరాశపర్చింది. 

దీంతో జేసన్ సంజయ్ రూట్ మార్చినట్లు ఇటీవలే టాక్ వినిపించింది. త్వరలోనే తండ్రి బాటలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో జేసన్ ఎంట్రీకి సంబంధించి మరో క్రేజీ టాక్ వైరల్‌గా మారింది. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరనే విషయంపై కోలీవుడ్‌లో ఇన్‌సైడ్ టాక్‌ వినిపిస్తోంది. ఆ వివరాలేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం. 

నిర్మాతగా అట్లీ.. 

ప్రముఖ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ ‍మూవీని నిర్మించనున్నారని కోలీవుడ్‌లో లేటేస్ట్ టాక్. అంతేకాకుండా ఈ సినిమాకు డ్యూడ్‌ ఫేమ్ కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే చేయనున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అట్లీ నిర్మాణంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుండటంతో ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.  రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. మరోవైపు ఇప్పటికే శింబు హీరోగా డైరెక్టర్ కీర్తీశ్వరన్ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. అయితే జేసన్ సంజయ్ సినిమా ఆఫర్ గురించి ఆయనకు తెలియజేయగా శింబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement