ఓటీటీల్లో మినీ దీపావళి.. ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్..! | This friday Ott Release Movies List Here watch ur favourate Movie | Sakshi
Sakshi News home page

Friday Ott Releases: ఓటీటీల్లో మినీ దీవాళి.. ఒక్క రోజే 18 చిత్రాలు స్ట్రీమింగ్..!

Oct 29 2026 7:50 PM | Updated on Oct 29 2026 8:01 PM

This friday Ott Release Movies List Here watch ur favourate Movie

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. దసరా సందడి ముగియడంతో అంతా దీపావళి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ శుక్రవారం దివాళీ కంటే ముందుగానే పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ ఫ్రైడే వెంకీమామ ఆదర్శ కుటుంబం, విశ్వక్ సేన్ కల్ట్‌తో పాటు మరో మూవీ కిల్లర్‌ థియేటర్లలో అలరించనుంది. వీటిలో ఆదర్శ కుటుంబంపై ఆడియన్స్‌లో బజ్ నెలకొంది. కల్ట్‌ కోసం కూడా మాస్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూడింటిలో ఏది హిట్ ‍అవుతుందో ఈ శుక్రవారం తేలిపోనుంది.

ఇక ఓటీటీల విషయానికొస్తే పలు హిట్ సినిమాలు సందడి చేయనున్నాయి. టాలీవుడ్ మూవీ ఎస్ఐ యుగంధర్‌తో పాటు సందీప్ కిషన్ సిగ్మా ఓటీటీకి రానుంది. కీర్తి సురేశ్‌ నటించిన మరో చిత్రం అక్క నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు ది డార్క్ హెవెన్ లాంటి క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలు కూడా రానున్నాయి. అవరచన్ అండ్ బాయ్స్, ఇమ్మోర్టల్ లాంటి డబ్బింగ్ మూవీస్‌, రుద్రవనం పీఎస్ అనే తెలుగు సిరీస్‌ ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్..

నెట్‌ఫ్లిక్స్

  •    అవరచన్ & బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30

  •    ఎస్ఐ యుగంధర్ (తెలుగు మూవీ) -  అక్టోబర్ 30

  •    అక్క (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30

  •    సిగ్మా (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30

  •    హౌ టూ రూయిన్ దివాళి: మీట్ ద పేరెంట్స్ (సౌతాఫ్రికన్ సిరీస్) - అక్టోబర్ 30

  •    ఏ కపుల్ ఆఫ్ లైస్ (స్వీడిష్ సిరీస్) - అక్టోబర్ 30

  •    కొలిజన్ కోర్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 30

  •    డెడ్ ఎండ్ జాబ్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 30

  •    మీథే మే క్యాన్ హై (హిందీ సిరీస్) - అక్టోబర్ 30

  •    అబ్సెస్ (అరబ్ సిరీస్) - అక్టోబర్ 30

  •    ఎస్‌సీటీవీ: ద గ్రేట్ షో యూ నెవర్ హెర్డ్ ఆఫ్ (కెనడియన్ షో) - అక్టోబర్ 30

    జియో హాట్‌స్టార్

  •    లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 30

  •    అబ్సెసన్: ద ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) - ‍అక్టోబర్ 30


అమెజాన్ ప్రైమ్

  •   అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 30

  •   ది డార్క్ హెవెన్(తమిళ సినిమా)- అక్టోబర్ 30


సోనీ లివ్

  •    ఇమ్మోర్టల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 30

జీ5

  •  రుద్రవనం పీఎస్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 30

ఆపిల్ టీవీ ప్లస్

  • నోక్టర్న్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 30

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement