రణ్‌బీర్ కపూర్ రామాయణ.. సీతారాముల కల్యాణం సాంగ్ రిలీజ్ | Ranbir kapoor and Sai Pallavi Ramayana Movie Jatha Goode song out now | Sakshi
Sakshi News home page

Ramayana Movie: రామాయణ మూవీ.. సీతారాముల కల్యాణం సాంగ్ రిలీజ్

Oct 29 2026 7:01 PM | Updated on Oct 29 2026 7:04 PM

Ranbir kapoor and Sai Pallavi Ramayana Movie Jatha Goode song out now

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే కాలిఫోర్నియాలో రామాయణ ప్రీమియర్ షో సైతం ప్రదర్శించారు.

ఇప్పటికే ట్రైలర్, సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే రామాయణ నుంచి మరో సాంగ్ విడుదల చేశారు. జతగూడే అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. శిరీష భాగవతుల ఆలపించారు. ఈ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటించారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement