అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా : త్రివిక్రమ్‌ | Trivikram Srinivas Explained Why He Touches Srinidhi Shetty Feet | Sakshi
Sakshi News home page

అందుకే శ్రీనిధి శెట్టి పాదాలకు దండం పెట్టా : త్రివిక్రమ్‌

Oct 29 2026 4:06 PM | Updated on Oct 29 2026 4:17 PM

Trivikram Srinivas Explained Why He Touches Srinidhi Shetty Feet

ఆదర్శ కుటుంబం సినిమా ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి కాళ్లకు దర్శకుడు త్రివిక్రమ్‌  దండం పెట్టిన సంగతి తెలిసిందే.  ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన  శ్రీనిధి శెట్టి దర్శకుడు త్రివిక్రమ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి పలకరించారు. ఈ క్రమంలో ఆయన శ్రీనిధి కాళ్లకు నమస్కరించబోయారు. దీంతో ఆశ్చర్యానికి గురైన శ్రీనిధి వెంటనే ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు త్రివిక్రమ్‌ చేసిన పనిని సమర్థిస్తుంటే..మరికొంతమంది మాత్రం  తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్.. తనకంటే వయసులో చిన్నదైన హీరోయిన్‌కు అలా నమస్కరించేందుకు ప్రయత్నించడం అవసరమా? అంటూ ట్రోల్‌ చేశారు. 

తాజాగా ఈ ఘటనపై త్రివిక్రమ్‌  స్పందించారు.  శ్రీనిధితో ఉన్న చనువుతో సరదాగా అలా కాళ్లకు దండం పెట్టానని చెప్పారు. గురువారం ఆదర్శ కుటుంబం సినిమా బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా శ్రీనిధి కాళ్లకు దండం ఎందుకు పెట్టారని ఓ మీడియా ప్రతినిధి ఆడగా​.. దానికి త్రివిక్రమ్‌ ఇలా సమాధానం చెప్పారు.

(చదవండి: శ్రీనిధి శెట్టి పాదాలకు నమస్కరించిన త్రివిక్రమ్‌.. అసలేం జరిగింది?)

‘నేను ఇప్పటిదాకా పని చేసిన హీరోయిన్లలో నాకు బాగా దగ్గరైన నటి శ్రీనిధి. నేను మాములుగా అందరితోనూ కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ శ్రీనిధి.. అందరికంటే ఎక్కువగా, ప్యామిలీ మెంబర్‌లా కలిసిపోయింది. ఆ చనువుతోనే..కామెడీగా ఆమె కాళ్లకు దండం పెట్టా. ఇద్దరు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మధ్య సరదాగా ఆటపట్టించే అలవాటు ఉంటుంది కదా.. నేను అలానే ఆమె కాళ్లకు దండం పెట్టినట్లు నటించా. అంతకు మించి వేరే ఉద్దేశ్యం ఏం లేదు’ అన్నారు. 

ఆదర్శ కుటుంబం ఈవెంట్‌ విషయానికొస్తే.. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించారు. శ్రీనిధీ శెట్టి, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లు. ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement