నా శరీరం చురుగ్గానే ఉంది.. ట్రోలింగ్‌పై కత్రినా స్పందన | Katrina Kaif Responds To Body Shaming Trolls After Motherhood, Says She Has No Desire To Go Back To Her Old Life | Sakshi
Sakshi News home page

తల్లి అవ్వడం కొత్త దశ..మళ్లీ వెనక్కి వెళ్లడం ఎందుకు?: కత్రినా

Oct 29 2026 11:46 AM | Updated on Oct 29 2026 12:50 PM

Katrina Kaif Respond On Body Shaming

‘ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల శరీరంలో మార్పులు వస్తాయని చాలా మందికి తెలుసు. అయినా కూడా బాడీ షేమింగ్‌ చేస్తున్నారు. మళ్లీ మునుపటిలా మారాలని ఒత్తిడి చేస్తున్నారు. తల్లి కావడం అనేది జీవితంలో ముందడుగే.. కానీ, వెనక్కి వెళ్లడం ఎలా కుదురుతుంది’ అని బాలీవుడ్‌ నటి కత్రీనా కైఫ్‌  ప్రశ్నించారు. ఇటీవల ఆమెను బాడీ షేమింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. అంబానీ ఇంట జరిగిన వినాయక చవితికి భర్త విక్కీ కౌశల్‌తో కలిసి హాజరు కాగా.. ఆ ఫోటోలను షేర్‌ చేస్తూ  చాలా బరువు పెరిగిందని ట్రోల్‌ చేశారు. 

(చదవండి: కాబోయే భర్త విషయంలో సాయిపల్లవి కండిషన్లు ..)

దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడుతూ.. ‘పిల్లలు పుడితే..కచ్చితంగా శరీరంలో మార్పులు వస్తాయి. ఈ విషయం ట్రోల్‌ చేసేవాళ్లకి కూడా తెలుసు. అయినా కూడా బాడీ షేమింగ్‌ చేస్తున్నారు. అది వారి వ్యక్తిగత నిర్ణయం. నా వరకు అయితే  తల్లి అవ్వడం అనేది ఓ అందమైన దశ. జీవితంలో ముందడుగు వేయాలనుకున్నాను. నా బలమైన కోరికను నెరవేర్చుకున్నాను. మళ్లీ ఇప్పుడు వెనక్కి వెళ్లాలని ఎందుకు అనుకుంటాను? తల్లి అవ్వడం నా జీవితంలో కొత్త దశ. దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నాను’ అని కత్రినా చెప్పుకొచ్చింది. 

ఇక తన ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఫిట్‌నెస్‌ విషయంలో నాకో క్లారిటీ ఉంది. నా శరీరం ఎప్పుడు చురుగ్గా ఉంటుందనే విషయం నాకు తెలుసు’ అన్నారు.కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ దాదాపు నాలుగేళ్లపాటు డేటింగ్ చేసి, పెద్దల అంగీకారంతో 2021 డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ళ తర్వాత 2025 నవంబర్ 7న కొడుకుకు జన్మనిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement