రోజా ‘లెనిన్‌ పాండియన్‌’ మూవీ రివ్యూ | Lenin Pandian Movie Review In Telugu, A Powerful Story Of Courage, Emotions And An Unlikely Fight Against The Sand Mafia | Sakshi
Sakshi News home page

‘లెనిన్‌ పాండియన్‌’ రివ్యూ: పిట్ట కొంచం కూత ఘనం.

Oct 29 2026 12:03 PM | Updated on Oct 29 2026 12:47 PM

Lenin Pandiyan Review In Telugu

ప్రతి మనిషిలో ఓ తెలియని శక్తి ఉంటుంది. ఆ శక్తికి ఆడ,మగ, జాతిమత, వయస్సులతో సంబంధముండదు. అటువంటి అద్వితీయ శక్తి బయటపడ్డపుడే మనిషి పూర్తి విలువ తెలుస్తుంది. ఆ కోవకు సంబంధించిన కథాంశమే లెనిన్ పాండియన్. ఈ కథ లైన్ చాలా చిన్నదైనా దాని ప్రభావం మాత్రం అనంతం. దానికి అభినందనీయుడు ఈ సినిమా దర్శకుడే. డిడి బాలచంద్రన్ తాను రాసుకున్న కథను తానే తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. దర్శకుడిగా బాలచంద్రన్ కు ఇది మొదటి సినిమా అయినా, ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా స్క్రీన్ ప్లేని రసవత్తరంగా రాసుకున్నాడు. ఎంతలా అంటే ఈ కథలోని పాత్రలతో ప్రేక్షకులు సినిమా మొత్తం కలిసి ప్రయాణిస్తారు. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. 

మరవర్మన్ సుందరపాండ్యన్ కొత్తగా పోలీసు ఉద్యోగంలో చేరతాడు. అయితే తన వయస్సు, శారీరక దృష్ట్యా అందరిలా పోలీసు అని అనిపించుకోలేడు. తండ్రి తదనంతరం వచ్చిన పోలీస్ ఉద్యోగంలో చుట్టూ ఉన్న సహోద్యోగులతోపాటు బయట ఉన్న వారు కూడా పాండ్యన్ ను హేళనకు గురి చేస్తూ ఉంటారు. మరో పక్క తమిళనాడు లోని ఓ మారుమూల గ్రామంలో తనకున్న చిన్నపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ ఉంటాడు దురైరాసు. ఆరు పదుల వయస్సున్న దురైరాసుకు మీనాక్షి అనే ఓ మేక, చిన్నపాటి పూరిపాక ఆ పై నలభైఏళ్ళ సంథానమ్ భార్యగా ఉంటారు. దురైరాసు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా ఇసుక మాఫియా జరుగుతూ ఉంటుంది. 

(చదవండి: తల్లి అవ్వడం కొత్త దశ..మళ్లీ వెనక్కి వెళ్లడం ఎందుకు?: కత్రినా)

ఈ ఇసుక మాఫియా నడిపేది కరడు గట్టిన నేరస్తులు. ఆ ఇసుక దోపిడీ నేపధ్యంలోనే తాను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న మీనాక్షి మేకను కోల్పోతాడు దురైరాసు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన దురైరాసు తన మేకను కోల్పోయినందుకుగాను ఇసుక మాఫియా పై హత్యకేసు పెడతాడు. కేసు విచారణ నేపధ్యంలో దురైరాసుకు సెక్యురిటీగా పాండ్యన్ ను నియమిస్తుంది కోర్టు. ఇక అక్కడి నుండి కథ ఎన్నో భావోద్వేగాలతో కూడిన మలుపులతో ప్రయాణిస్తుంది. ఓ వైపు నిస్సహాయుడైన దొరైరాసు, మరో వైపు సరైన బలం లేని పాండ్యన్ ..వీరిద్దరూ కలిసి హత్యగాబడ్డ మేక హంతకులైన ఇసుక మాఫియాను ఎదిరించగలరా అన్నదే సినిమా.

 ఈ సినిమా చూసే ప్రేక్షకులకి వీళ్లా చేసేది, వీళ్ళు చేయగలరా అని ప్రతి క్షణం అనుకున్నా ఆ పాత్రలతో మమేకమవుతారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రధాన పాత్రధారి దురైరాసు పాత్రను పోషించిన గంగై అమరన్ సహజత్వంతో ఆకట్టుకుంటాడు. అలాగే తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతురాలు ప్రముఖ నటి రోజాసెల్వమణి కూడా సంథానమ్ పాత్రలో ఒదిగిపోయారు. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.  మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్.
-ఇంటూరు హరికృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement