వర్షిణి, ముకేశ్‌ లిప్‌ సీన్‌.. రూ.300లకు కొన్న రోహిత్‌! కానీ.. | bigg boss 10 telugu Latest Episode Highlights | Sakshi
Sakshi News home page

bigg boss 10 Highlights: దేబ్జానీ, ముకేశ్‌ లవ్‌ బ్రేకప్‌..

Oct 29 2026 7:45 AM | Updated on Oct 29 2026 8:34 AM

bigg boss 10 telugu Latest Episode Highlights

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 రోజురోజుకీ ఆసక్తికరంగా సాగుతోంది. హౌస్‌మేట్స్‌ మధ్య గొడవలు, సరికొత్త టాస్క్‌లు, అనూహ్య పరిణామాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హౌస్‌లో హోటల్‌ టాస్క్‌ను ప్రారంభించాడు బిగ్‌బాస్‌. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు వేర్వేరు పాత్రలను అప్పగించాడు. ఈ టాస్క్‌లో ఎవరు ఎలా ఆడారు? ఎవరికి లాభం చేకూరింది? అసలు హౌస్‌లో ఏం జరిగిందంటే..

మూడు రకాల బాధ్యతలు
బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రారంభమైన హోటల్‌ టాస్క్‌లో కంటెస్టెంట్లను మూడు బృందాలుగా విభజించారు. ఎల్లో లెవల్‌లో ఉన్నవారు హోటల్‌ ఓనర్లుగా, రెడ్‌ లెవల్‌లో ఉన్నవారు వర్కర్లుగా, గ్రీన్‌ లెవల్‌లో ఉన్నవారు అతిథులుగా వ్యవహరించాలి. అతిథులకు డబ్బుతో పాటు స్టార్స్‌ కూడా అందించారు. హోటల్‌ సిబ్బంది అందించే సేవలు నచ్చితే వారికి డబ్బులు ఇవ్వొచ్చు. ఓనర్లు ఇచ్చే ఆతిథ్యం నచ్చితే స్టార్స్‌ అందించవచ్చు.

ఓనర్లుగా ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున కేటాయించారు. ఈ డబ్బుతో వర్కర్లను పనుల్లో నియమించుకొని, అతిథులను మెప్పించి ఎక్కువ స్టార్స్‌ సంపాదించాలి. మరోవైపు వర్కర్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎల్లో లెవల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అలా పైస్థాయికి చేరుకున్నవారికి డబుల్‌ ఎలిమినేషన్‌ ముప్పు తప్పుతుంది. ఇక ఓనర్లలో అత్యధిక స్టార్స్‌ సంపాదించినవారు గ్రీన్‌ లెవల్‌కు చేరుకొని ఈ వారం ఎలిమినేషన్‌ నుంచి రక్షణ పొందుతారు.

హోటల్‌లో ఆసక్తికర పాత్రలు
ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ప్రత్యేకమైన పాత్రలను ఇచ్చాడు బిగ్‌బాస్‌. దేబ్జానీని ప్రతిదానిలోనూ పర్ఫెక్షన్‌ కోరుకునే ధనవంతురాలిగా చూపించారు. హోటల్‌లో సేవలు తనకు నచ్చినట్లు లేకపోతే ఆమె అస్సలు ఒప్పుకోదు. ఆమె ప్రియుడిగా ముకేశ్‌ పాత్రను పోషించాడు. అతడొక స్ట్రగ్లింగ్‌ ఫుడ్‌ బ్లాగర్‌. పైగా విపరీతమైన మతిమరుపు ఉన్న వ్యక్తి. వీరిద్దరూ తమ పెళ్లి ఏర్పాట్లలో భాగంగా హోటల్‌కు వచ్చినట్లు టాస్క్‌లో చూపించారు.

హోటల్‌లో ఆతిథ్యం నచ్చితే తమ పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని భావిస్తారు. మరోవైపు నీతూను గాసిప్స్‌ ఇష్టపడే వ్యక్తిగా, త్రిగుణ్‌ను ఎదగాలని ప్రయత్నించే కొత్త డాన్‌గా పరిచయం చేశారు. అమన్‌ అతడికి సన్నిహితుడిగా, సహాయకుడిగా వ్యవహరించాలి. ప్రేమ విషయంలో అదృష్టం కలిసిరాని వ్యక్తిగా అమన్‌ పాత్రను రూపొందించారు. రోహిత్‌, శ్వేత, సుధీర్‌ హౌస్‌కీపింగ్‌, వెయిటర్‌ బాధ్యతలు చేపట్టగా.. రామకృష్ణ, ఝాన్సీ వంటవాళ్లుగా వ్యవహరించారు. వంశీకి ఇతర కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

(ఇదీ చదవండి: భర్త ముందే బోల్డ్ సీన్స్.. అసలు ఎలా చేశారు?)

వర్షిణితో అమన్‌ లవ్‌ ట్రాక్‌..
టాస్క్‌ కొనసాగుతున్న కొద్దీ కంటెస్టెంట్లు తమకు అనుకూలంగా ఆటను మలుచుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వర్షిణి, అమన్‌ లవ్‌ ట్రాక్‌ మొదలుపెట్టడం.. మరోవైపు ముకేశ్‌తో దేబ్జానీ మధ్య గొడవ రావడం వల్ల బ్రేకప్‌ అవుతుంది.దీంతో దేబ్జానీ భావోద్వేగానికి గురై ఏడ్చింది.  దీంతో హౌస్‌లో కొంతసేపు గందరగోళం నెలకొంది.

ఇంతలో బిగ్‌బాస్‌ మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. ముకేశ్‌, వర్షిణి ముద్దు పెట్టుకున్న ఫొటోను హౌస్‌లోకి పంపించాడు. ఆ ఫొటోను చూసిన రోహిత్‌.. ముకేశ్‌తో బేరం కుదుర్చుకొని రూ.300 తీసుకుని అతడికి ఫొటో ఇచ్చేశాడు.  ఆ తర్వాత బిగ్‌బాస్‌ ఆ ఫొటోలను స్క్రీన్‌పై ప్రదర్శించడంతో దేబ్జానీ, అమన్‌ తీవ్రంగా స్పందించారు. దీంతో హౌస్‌లో మరోసారి వాడివేడి వాతావరణం కనిపించింది.

స్టార్స్‌ కోసం కంటెస్టెంట్ల ఎత్తులు
మరోవైపు తమకు అనుకూలంగా స్టార్స్‌ సంపాదించుకునేందుకు కొందరు కంటెస్టెంట్లు ప్రయత్నించారు. నీతూ, త్రిగుణ్‌, అమన్‌ కలిసి రూ.4 వేల డబ్బును తీసుకొని తమ స్టార్స్‌ను రాంప్రసాద్‌, శివలకు ఇచ్చినట్లు చూపించారు. ఈ క్రమంలో త్రిగుణ్‌.. నరేశ్‌ను కూడా దేబ్జానీ దగ్గరకు వెళ్లి స్టార్‌ అడగాలని సూచించాడు. అయితే దేబ్జానీ నరేశ్‌కు స్టార్‌ ఇచ్చేందుకు అంగీకరించినా.. సుధీర్‌, ఝాన్సీలకు మాత్రం ఇవ్వొద్దని షరతు పెట్టింది.

వర్షిణి, రోహిత్‌ విజయం
ఓనర్లు, వర్కర్ల మధ్య సమన్వయం ఎలా ఉందో తెలుసుకునేందుకు బిగ్‌బాస్‌ మరో ఆటను పెట్టాడు. దీనికి కమ్యూనికేషన్‌, కోఆర్డినేషన్‌ టాస్క్‌గా పేరు పెట్టాడు. ఇందులో ఓనర్ల నుంచి ఒకరు, వర్కర్ల నుంచి మరొకరు జంటగా ఆడాలి. ఒకరు బొమ్మలను చూసి సైగల ద్వారా వివరించాలి. మరొకరు ఆ సంకేతాలను అర్థం చేసుకొని బోర్డుపై వాటిని సరైన క్రమంలో అమర్చాలి.

ఈ పోటీలో ఓనర్ల తరఫున వర్షిణి, నరేశ్‌ పాల్గొన్నారు. నరేశ్‌ తన జోడీగా ఝాన్సీని ఎంచుకోగా.. వర్షిణి రోహిత్‌ను ఎంపిక చేసుకుంది. ఈ ఆటకు త్రిగుణ్‌ సంచాలకుడిగా వ్యవహరించాడు. చివరకు వర్షిణి, రోహిత్‌ జంట విజయం సాధించింది.  ఇలా నిన్నటి ఎపిసోడ్‌ సాగింది.

(ఇదీ చదవండి: అనిరుధ్- కావ్య రిసెప్షన్‌.. ఒక్కో ఇన్విటేషన్‌కే అన్ని వేలు ఖర్చా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement