అల్లం – బెల్లం – గుమ్మడికాయ  | Allam-Bellam shooting completed | Sakshi
Sakshi News home page

అల్లం – బెల్లం – గుమ్మడికాయ 

Oct 29 2026 4:32 AM | Updated on Oct 29 2026 4:32 AM

Allam-Bellam shooting completed

అల్లం – బెల్లాన్ని విజయవంతంగా కెమేరాలో క్యాప్చర్‌ చేశారు మణిరత్నం. అనుకున్నట్లుగా చిత్రీకరణ పూర్తవడంతో హ్యాపీగా గుమ్మడికాయ కొట్టేశారు. విజయ్‌ సేతుపతి, సాయి పల్లవి జంటగా మణిరత్నం దర్శకత్వంలో ఆ మధ్య ఆరంభమైన ‘ఇంజి వెల్లమ్‌’ సినిమాకి సంబంధించిన వార్త ఇది. ఇంజి, వెల్లమ్‌ అంటే ‘అల్లం బెల్లం’ అని అర్థం. ఈ చిత్రం షూటింగ్‌ని చాలా సైలెంట్‌గా పూర్తి చేశారు. 

జూలై నెలాఖరున చిత్రీకరణ ఆరంభించి, అక్టోబరు నెలాఖరుకల్లా... జస్ట్‌ మూడు నెలల్లో ఈ చిత్రాన్ని ముగించడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మణిరత్నం మార్క్‌ ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. కోల్‌కత్తా నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం అని కోలీవుడ్‌ టాక్‌. వచ్చే ఏడాది జనవరి 29న ‘ఇంజి వెల్లమ్‌’ని విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement