సాయిపల్లవి.. నవంబర్.. చాలా స్పెషల్ | Sai Pallavi Ramayana And Om Movies Release With In 15 Days | Sakshi
Sakshi News home page

Sai Pallavi: ఇటు సీత.. అటు ఐపీఎస్ ఆఫీసర్

Oct 27 2026 12:47 PM | Updated on Oct 27 2026 1:29 PM

Sai Pallavi Ramayana And Om Movies Release With In 15 Days

సాయిపల్లవి.. ఈ పేరు రాబోయే నెలరోజుల్లో కాస్త గట్టిగానే వినిపించనుంది. ఎందుకంటే చాన్నాళ్లుగా దక్షిణాది సినిమాల్లో కనిపించని ఈ బ్యూటీ.. కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు క్రేజ్ ఉన్న మూవీస్‌తో రాబోతుంది. ఆయా పాత్రలు, సదరు చిత్రాల్లో సాయిపల్లవే మెయిన్ హైలైట్‌గా కానుందని అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

మొదటగా 'రామాయణ' విషయానికొస్తే ఇందులో ఈమె సీత పాత్ర పోషించింది. వచ్చే శుక్రవారం అంటే నవంబర్ 05న పాన్ ఇండియా రేంజులో ఈ మూవీ రిలీజ్ కానుంది. టీజర్ వచ్చినప్పుడు సీత పాత్ర, ఆహార్యాన్ని సందేహిస్తూ కొందరు ట్రోల్స్ చేశారు. ట్రైలర్, సాంగ్స్ వచ్చిన తర్వాత ఇవి కాస్త తగ్గినట్లే కనిపించాయి. ప్రమోషనల్ కంటెంట్‌పై ఎన్ని విమర్శలైనా రావొచ్చు కానీ మూవీ వచ్చిన తర్వాత అందులో సీత పాత్ర ఆకట్టుకుంటే మాత్రం ఇవన్నీ పక్కకువెళ్లిపోతాయి.

'ఓం' విషయానికొస్తే.. ధనుష్ హీరోగా చేసిన తమిళ సినిమా ఇది. ఇందులో ఐపీఎస్ నిత్యారెడ్డి అనే పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా సాయిపల్లవి నటించింది. ఈమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ అయితే అదిరిపోయింది. ధనుష్, మమ్ముట్టి పాత్రలతో పాటు ఈమెది ఎక్కువగా హైలైట్ అయ్యేలా ఉందనిపిస్తోంది. ఈ మూవీ నవంబర్ 20న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.

గతేడాది ఫిబ్రవరిలో 'తండేల్' మూవీతో థియేటర్లలోకి వచ్చిన సాయిపల్లవి.. అద్భుతమైన సక్సెస్ అందుకుంది. మళ్లీ ఈ ఏడాది మే నెలలో 'ఏక్ దిన్' అని హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఇది ఘోరంగా డిజాస్టర్ అయింది. దీంతో ఆశలన్నీ 'రామాయణ' మీదే పెట్టుకుంది. ఒకవేళ ఈ రెండు సినిమాలు హిట్ అయి, సాయిపల్లవి పాత్రలకు పేరొస్తే ఈ నవంబర్ ఈమెకు స్పెషల్ అవుతుంది. లేదంటే కష్టమే!

(ఇదీ చదవండి: చిరంజీవి.. 'మెగావర్స్')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement