ఓటీటీలో సీఎం విజయ్‌ కొడుకు సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Sigma Movie OTT Release Date Sundeep Kishan Movie | Sakshi
Sakshi News home page

Sigma Movie OTT: ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Oct 27 2026 12:48 PM | Updated on Oct 27 2026 1:31 PM

Sigma Movie OTT Release Date Sundeep Kishan Movie

సందీప్‌ కిషన్‌ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సిగ్మా’. ఈ మూవీని తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ నిర్మించగా.. గాంధీ జయంతి రోజున విడుదలైంది. మిక్స్‌డ్‌  టాక్‌ను సొంతం చేసుకుంది.  అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.  అక్టోబర్‌ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తోంది.

కథ ఏంటంటే:
గురు(సందీప్‌ కిషన్‌).. అమ్మకు గుర్తుగా లైబ్రరీ నడుపుతూ..అప్పులు తీర్చడానికి నానా కష్టాలు పడుతుంటారు. యూట్యూబ్‌లో ఆడియో బుక్‌ లాంచ్‌ చేస్తాడు. దానికి ఆర్జే సామ్‌ (ఫరియా అబ్దుల్లా) వాయిస్‌ అందిస్తుంది. కొద్ది కొద్దిగా డబ్బులు చేతికి అందుతున్న తరుణంలో.. కోటి రూపాయలకు పైన ఉన్న అప్పుని వెంటనే కట్టమని అప్పు ఇచ్చినవాడు ఒత్తిడి చేస్తారు. దీంతో యూట్యూబ్‌ ద్వారా వచ్చిన డబ్బుతో క్యాసినో ఆడి రూ. కోటీ సంపాదించాలనుకుంటాడు. అయితే క్యాసినోలో ఉన్నదంతా పోగొట్టుకుంటాడు.

అదే సమయంలో గురుకి ఓ పెన్‌డ్రైవ్‌  దొరుకుతుంది. అందులో రూ. 1000 కోట్లకు సంబంధించిన రహస్యం ఉంటుంది. ఆ డబ్బుని దక్కించుకునేందుకు ప్లాన్‌  వేస్తాడు. అదేంటి? వైజాగ్‌లోని థియేటర్ యజమాని విన్సెంట్ (శివ్ పండిట్), డ్రగ్స్‌ మాఫియా డాన్‌  వీరయ్య రెడ్డి(సంపత్‌ రాజ్) కు  రూ. 1000 కోట్లతో ఉన్న సంబంధం ఏంటి? దయా ఎవరు? వీరయ్య రెడ్డికి దయాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు రూ. 1000 కోట్లు ఎవరికి దక్కాయి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

(ఇదీ చదవండి: తాళం వేసిన ఇంట్లో చిక్కుకున్న నటి కుమార్తె)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement