హీరో సూర్య ప్రధాన పాత్రలో జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీన్’. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్‌గా కనిపించనుంది. నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబరు 6న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ఈ మూవీ ఈవెంట్‌లో సూర్య పాల్గొని భార్య జ్యోతిని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు అద్భుతమైన పాత్రలు ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్ తెలిపారు. తన భార్య జ్యోతిక ప్రోత్సాహం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని హీరో సూర్య గుర్తుచేశారు. కాగా ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. విరోష్ జంటకు అండగా ఫ్యాన్స్..)


