టాలీవుడ్‌లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు సంబంధించిన వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ జంటపై సోషల్ మీడియాలో విడాకుల రూమర్స్ చక్కర్లు కొట్టడంతో తాజాగా వీరిద్దరూ స్పందించారు. తమ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దంటూ రష్మిక సుదీర్ఘ పోస్ట్ పెట్టగా.. విజయ్ సైతం తన ప్రేమను చాటుకుంటూ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. దీంతో ఈ జంట అభిమానులు మరోసారి వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు
రష్మిక తన పోస్ట్‌లో తమ ప్రేమను ఇతరుల అభిప్రాయాలతోనో, ప్రపోజల్స్‌తోనో కొలవలేరనే విషయాన్ని స్పష్టం చేసింది. మరోవైపు విజయ్ కూడా తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఆమె తనకు భార్య మాత్రమే కాదని, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఉమెన్ అని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి పోస్టులు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
ఈ నేపథ్యంలో విరోష్ అభిమానులు తమ అభిమాన జంటకు మద్దతుగా నిలుస్తున్నారు. విజయ్, రష్మిక కలిసి ఉన్న పాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ‘నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: విజయ్‌ను మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకుంటా.. తప్పేంటి? : రష్మిక మందన్న)
#VijayDeverakonda and #RashmikaMandanna reacted to the trolls against them after the recent KWK episode https://t.co/ux3qTTcDJS https://t.co/84DmaHxzkh
— The Climax India (@TheClimaxIndia) October 26, 2026


