టాలీవుడ్‌లో ముచ్చటైన జంట అంటే గుర్తు వచ్చేది రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ. అయితే వీరి వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక ఘాటుగా స్పందించింది. తమ బంధం గురించి అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఓ ఇంటర్వ్యూలోని విషయాలను పట్టుకుని కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టింది. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రపోజల్ కంటే అదే ముఖ్యం!
‘మా బంధం గురించి కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా బాండిగ్.. ఎవరు ఎన్నిసార్లు ప్రపోజ్ చేశారు? ఎంతకాలం ఎదురుచూశారు? అనే అంశాలకు సంబంధించినది కాదు. జీవితంలో సంతోషాలు, ఒడదొడుకులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ కలిసి జీవించగలమా? ఒకరినొకరు సరైన తోడుగా ఉండగలమా? అనే విషయాలను అర్థం చేసుకోవడానికి కొంతం సమయం తీసుకున్నాం. మాకు పెళ్లి అంటే మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేయడం, వేలికి ఉంగరం పెట్టడం మాత్రమే కాదు. కలిసి జీవితాన్ని సరైన దారిలో నిర్మించుకోవడమే అసలైన విషయం.
విజయ్‌ను అంతగా ప్రేమిస్తే తప్పేంటి?
పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ప్రేమించకపోతే అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? జీవితాంతం తనకు తోడుగా ఉండే వ్యక్తి, సాధారణ రోజుల్లోనూ ప్రత్యేక సందర్భాల్లోనూ తనకు స్నేహితుడిగా నిలిచే వ్యక్తి విజయ్. నా పిల్లలకు తండ్రిగా, నేను వృద్ధాప్యంలోకి వెళ్లినప్పుడు కూడా తోడుగా ఉండే వ్యక్తిగా అతడు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తే తప్పేంటి? అలాంటి వ్యక్తిని అమితంగా ప్రేమిస్తున్నానని చెప్పడానికి నేను వెనుకాడను. ఒకరినొకరు అంతగా ప్రేమించుకునే వ్యక్తులు దొరకడం అదృష్టం. నాకు అలాంటి ప్రేమ దొరికింది. విజయ్‌తో 100 సార్లు కాదు.. మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా సిద్ధమే. మా ప్రేమను సంఖ్యలతో కొలవలేం’ అని ఎక్స్ వేదికగా రష్మిక పేర్కొంది.
నా కుటుంబం జోలికి రావొద్దు!
తనను ఎంతగా విమర్శించినా భరించగలనని.. తన కుటుంబం గురించి తెలియకుండా మాట్లాడడం సరికాదని రష్మిక అసహనం వ్యక్తం చేసింది. మహిళల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామనే పేరుతో కొందరు చేసే వ్యాఖ్యలు నిజమైన మహిళా సాధికారత కాదని, అవి వేధింపుల లాంటివే అని అభిప్రాయపడింది.

అసలు వివాదం ఏంటంటే?
ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈ జంట పాల్గొని పలు విషయాలను ముచ్చటించింది. ఓ సందర్భంలో విజయ్ మాట్లాడుతూ.. ‘నన్ను రష్మిక పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగింది’ అని అన్నారు. దీంతో విజయ్‌ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు వారిని సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన రష్మిక.. తమ గురించి వస్తున్న అభిప్రాయాలు, ఉచిత సలహాలు హద్దులు దాటుతున్నాయని పేర్కొంది. సాధారణంగా ఇలాంటి విషయాలపై స్పందించనని, ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తానని చెప్పి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది.
(ఇదీ చదవండి: నా తప్పేమీ లేదు.. అది ఆలస్యంగా తెలుసుకున్నా: కీర్తి సురేశ్)
🫰🏻🫶🏻♥️ https://t.co/nQ3W0DYf0K
— Rashmika Mandanna (@iamRashmika) October 26, 2026


