బిగ్‌బాస్ 10: చప్పగా సాగిన 8వ వారం నామినేషన్స్ | Bigg Boss 10 Telugu Day 50, Oct 27th 2026 Full Episode Highlights, Trigun And Mukesh Get Into Heated Arguments In Nominations | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: గొడవలు పడకుండానే నామినేషన్ ఎపిసోడ్

Oct 27 2026 9:54 AM | Updated on Oct 27 2026 10:19 AM

Bigg Boss 10 Telugu Day 50 Highlights 8th Week Nominations

సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్లు అనగానే గొడవలు, అరుచుకోవడాలు, రచ్చ.. ఇలా చాలానే ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్‌లోనూ గతవారాల్లో అలానే జరిగింది. కానీ ఈ సోమవారం(అక్టోబర్ 26) మాత్రం అలాంటివేం లేకుండానే ఈ ప్రక్రియ సాగింది. ఇంతకీ 10వ సీజన్‌లోని 50వ రోజు అసలేం జరిగింది?ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: డబుల్ ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారు?)

ఆదివారం ఎపిసోడ్ సరదాగా సాగినప్పటికీ డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఎమోషనల్‌గానూ అనిపించింది. ఫుడ్ విషయంలో ముకేశ్ – దేబ్జానీ గొడవ పడ్డారు. శివ్‌తోనూ ముకేశ్ గొడవ పడ్డాడు. షాలిని వెళ్లిపోవడంతో ఆమె బెడ్.. రోహిత్, అమన్ తీసుకోడానికి ట్రై చేశారు. ఇక ముకేశ్ మారిపోయిన విధానం గురించి దేబ్జానీ, శివ్, శ్వేత డిస్కషన్ పెట్టుకున్నారు. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ హడావుడి ఉంటుంది కదా. అలానే ఈసారి అది మొదలవడానికి ముందు గోట్ నుంచి అల్టిమేట్ గోట్ టాస్క్ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఎల్లో, రెడ్ లెవల్‌లోని సభ్యుల భవిష్యత్.. గ్రీన్‌లో ఉన్న గోట్స్ డిసైడ్ చేస్తారని పేర్కొన్నారు. మొదటి రౌండ్‌లో ఎల్లో, రెడ్‌లోని వాళ్లని గ్రీన్ వాళ్ళు నామినేట్ చేయాలి. గ్రీన్ మెంబర్స్ రెండు వారాలు నామినేషన్స్ నుంచి సేవ్ ‍అయ్యారని ఇదివరకే చెప్పారు. గ్రీన్‌లో త్రిగుణ్, అమన్, దేబ్జానీ, నీతూ, ముకేశ్ గోట్స్‌గా ఉన్నారు.

గ్రీన్‌లోని వాళ్లు ఒక్కొక్కరు మూడు నామినేషన్స్ చేసుకోవచ్చు. మొదట ఎవరు ఎంతమందిని నామినేట్ చేస్తారు అనేది డిసైడ్ అవ్వాలి. తర్వాత స్లిప్ మీద రాయాలి. తర్వాత ఎవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పి చేయాలి. గోట్స్ అంతా ఒక్కర్నే నామినేట్ చేస్తామని చెప్పినా త్రిగుణ్ మాత్రం మూడు నామినేషన్స్ చేస్తానని అన్నాడు. నీతూ మొదటగా వచ్చి ఝాన్సీని నామినేట్ చేసింది. త్రిగుణ్, రాంప్రసాద్‌ని నామినేట్ చేసి.. కెప్టెన్సీ సరిగ్గా చేయలేదని అన్నాడు. ముకేశ్, రామకృష్ణని నామినేట్ చేయగా గొడవ పెట్టుకున్నారు. రామకృష్ణ మూర్ఖుడు అని ముకేశ్ అన్నాడు. త్రిగుణ్ తన రెండో నామినేషన్‌గా రోహిత్ అని చెప్పాడు. ఆయన చేసే విషయాలు అని త్రిగుణ్ చెబుతుంటే.. రోహిత్ ఎగతాళిగా నవ్వాడు. రివర్స్‌లో త్రిగుణ్‌ని మూర్ఖుడు అని తిట్టి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు.

దేబ్జానీ.. ఝాన్సీని నామినేట్ చేసింది. అమన్, సుధీర్‌ని నామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ కాసేపు గొడవ పడ్డారు. సుధీర్ మాట్లాడుతున్నది వినకుండానే అమన్ వెళ్ళిపోయాడు. చివరగా త్రిగున్, వర్షిణిని నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్య వీళ్ల స్నేహం గురించి డిస్కషన్ నడిచింది. దీంతో వర్షిణి కూడా ఫ్రెండ్‌గా త్రిగుణ్ సపోర్ట్ చేయలేదని ఏడ్చింది. అలా ఈ ఎపిసోడ్‌లో గ్రీన్ మెంబర్స్ నామినేషన్స్ పూర్తయ్యాయి. మంగళవారం నాడు మిగిలిన సభ్యుల నామినేషన్స్ జరగనున్నాయి.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా దేవయాని కూతురు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement