డబ్బింగ్‌ పూర్తి | Anupama Parameswaran completes dubbing for Bhogi Movie | Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ పూర్తి

Oct 27 2026 4:22 AM | Updated on Oct 27 2026 4:22 AM

Anupama Parameswaran completes dubbing for Bhogi Movie

‘భోగి’ మూవీ కోసం తన పాత్ర తాలూకు డబ్బింగ్‌ పూర్తి చేశారు సులోచన రాణి. శర్వానంద్‌ హీరోగా నటించిన పీరియాడికల్‌ యాక్షన్  డ్రామా ‘భోగి’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ , డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించారు. సంపత్‌ నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధా మోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా నవంబరు 12న విడుదల కానుంది. 1960ల ప్రా రంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్‌ సరిహద్దు నేపథ్యంతో కథనం సాగుతుంది.

ఇందులో గంగ పాత్రలో శర్వానంద్, కందుల సులోచనారాణిగా అనుపమా పరమేశ్వరన్ , మందారంగా డింపుల్‌ హయతి నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్  వర్క్స్‌ జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి తన డబ్బింగ్‌ వర్క్‌ను అనుపమ పూర్తి చేశారని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement